గత వారం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాలను చవిచూసింది. ఈ వారం మాత్రం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 591 పాయింట్లు లాభపడి 81, 973 దగ్గర ముగియగా.. నిఫ్టీ 163 పాయింట్లు లాభపడి 25, 127 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 84.07 దగ్గర హైలెవల్‌లో ముగిసింది.
ఇది కూడా చదవండి: TGSRTC MD VC Sajjanar: బస్సు ఛార్జీలు పెంపుపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ..
నిఫ్టీలో విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉండగా, ఓఎన్‌జిసి, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ మరియు అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టపోయాయి. మెటల్, మీడియా మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంక్, రియల్టీ 1 శాతం చొప్పున లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది.
ఇది కూడా చదవండి: TGSRTC MD VC Sajjanar: బస్సు ఛార్జీలు పెంపుపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ..