ఉక్రెయిన్‌పై రష్యా గత రెండేళ్లుగా యుద్ధం సాగిస్తోంది. ఉక్రెయిన్ కూడా దాడులను తిప్పికొడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను పెంచేందుకు ఉత్తర కొరియా సాయం కోరింది. దీంతో కిమ్‌కు సంబంధించిన సేనలు రష్యాలోకి అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని నాటో తాజాగా ధ్రువీకరించింది.
శీతాకాలంలో మహారాష్ట్ర ఎన్నికలు హీటు పెంచుతున్నాయి. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓ వైపు నామినేషన్లు.. ఇంకో వైపు ప్రచారాలు దూకుడుగా సాగిపోతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో పెద్ద పెద్ద ధనవంతులే పోటీ చేస్తున్నారు.
రీల్స్ మోజులో పడి కొందరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రమాదమని తెలిసి కూడా ఎదురెళ్లుతున్నారు. లేనిపోని కష్టాలు తెచ్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది.
వయనాడ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ దూసుకుపోతున్నారు. సోమవారం కొండ నియోజకవర్గంలో ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. మదర్ థెరిస్సాను గుర్తుచేసుకున్నారు.
ఆమె ఒక ఆధ్మాత్మిక బోధకురాలు.. ఎంతో మందిని తన ప్రసంగాలతో మోటివేషన్ చేస్తుంది. తన గానంతో.. ప్రసంగాలతో ప్రజలను ప్రేరేపిస్తోంది. జీవితానికి సంబంధించిన ఎన్నో విలువలను నేర్పిస్తుంది. విలువలు గురించి, సద్గుణాల గురించి జనాలకు పాఠాలు నేర్పిస్తుంది.
ప్రజా సేవకుడు అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది వాళ్లే మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో ఓ సీపీఎం నాయకుడు పాడు బుద్ధి ప్రదర్శించాడు. ఇంటర్వ్యూకు వచ్చిన ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఇజ్రాయెల్ ముందే హెచ్చరించినట్టుగా ఇరాన్‌పై దాడులకు తెగబడింది. శనివారం ఇరాన్ వైమానికి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దీంతో తమ లక్ష్యాలను పూర్తి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వైమానికి స్థావరాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల పరిస్థితులు కారణంగా గత వారం సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఈ వారం ఆసియా మార్కెట్లోని అనుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చింది.
కాంగ్రెస్ అగ్ర ప్రియాంకాగాంధీ నామినేషన్ పత్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈనెల 23న ప్రియాంకాగాంధీ వయనాడ్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆమె నామినేషన్ వేశారు. అయితే తాజాగా ప్రియాంక నామినేషన్ ఆమోదం పొందినట్లు సోమవారం అధికారులు ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుల్మార్గ్లోని బోటాపతేర్ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రవాదులో దాడిలో ఇద్దరు జవాన్లతో పాటు ఇద్దరు పౌరులు ప్రాణాలు వదిలారు. పలువురు జవాన్లు గాయపడ్డారు. బారాముల్లాలో కాన్వాయ్‌లో భాగంగా ఉన్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.