కాసేపట్లో లోక్‌భవన్‌కు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకోనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందజేయనున్నారు. వైసీపీకి చెందిన 40 మందికి మాత్రమే గవర్నర్‌ను కలిసేందుకు అనుమతిని ఇచ్చారు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులు లోక్‌భవన్‌కు చేరాయి. గవర్నర్‌కు కలిసేందుకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో జగన్ విజయవాడ బయలుదేరారు.
విజయవాడ నుంచి బందర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అంబేద్కర్ విగ్రహనికి నివాళులర్పించి.. కాలినడకన లోక్‌భవన్‌కు వెళ్లనున్నారు. జగన్ వెంట వైసీపీ నేతలు నడుస్తున్నారు. పోలీసుల నిబంధనల మేరకు 40 మందితో లోక్‌భవన్‌కు జగన్ వెళ్లనున్నారు. గవర్నర్‌ను కలిసి కోటి సంతకాల పత్రాలను అందించిన అనంతరం.. జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశం అయిన విషయం తెలిసిందే.
Also Read: Rajeev Shukla-BCCI: మ్యాచ్ రద్దుపై ఫాన్స్ ఫైర్.. స్పందించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారానే కార్పొరేట్ వైద్యం అందించాలని టర్గెట్ పెట్టుకున్నారు. రాష్ట్రంలో వైద్య, విద్యా అవకాశాలను విస్తరించడం కోసమే ఈ అడుగు వేశారు. ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కాగా.. వైసీపీ దిగిపోయేనాటికి మరో 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలేజీల నిర్మాణం నిర్లక్ష్యం చేసింది. చివరకు పీపీవీ విధానం పేరిట ప్రైవేటీకరణ చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ.. కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి జగన్ పిలుపు ఇచ్చారు. అక్టోబర్‌లో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు కోటి సంతకాలను పూర్తి చేసింది. కోటి సంతకాల ప్రతులను గవర్నర్‌కు అందించేందుకు జగన్ వెళ్తున్నారు.