నష్ట పరిహారం అందజేయడానికి ఆధార్ కార్డులోని వయసును చూడడం కరెక్ట్ కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్-హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.
దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండు ప్రధానమైన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. వయనాడ్ ప్రత్యేకంగా ఫోకస్ అవుతోంది. దీనికి ప్రధానంగా.. ఇక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేయడమే కారణం. తొలిసారి ప్రియాంక ఎన్నికల బరిలో నిలబడ్డారు.
దానా తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుఫాన్ పెను బీభత్సమే సృష్టించనుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో దానా తుఫాన్ హడలెత్తించనుంది. ఐఎండీ హెచ్చరికలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ప్రధాని మోడీతో జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఒమర్ అబ్దుల్లా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర హోదా తీర్మానాన్ని అందజేశారు.
కేంద్రమంత్రి జయంత్ సింగ్ కుమార్తె సాహిరా సింగ్ కూచిపూడి ప్రదర్శనతో అరంగేట్రం చేసింది. ఢిల్లీలోని కమానీ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ప్రదర్శనతో ఎంట్రీ ఇచ్చింది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్‌లో దాఖలు చేసిన అఫిడవిట్‌తో భర్త రాబర్ట్ వాద్రాకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. బుధవారం వయనాడ్ కలెక్టరేట్లో ప్రియాంక నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తనకు రూ.12 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో శరద్‌పవార్ నేతృత్వంలోని పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గడియారం గుర్తు తమకే కేటాయించాలంటూ శరద్‌పవార్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జొమాటో యాజమాన్యంలోని బ్లింకిట్ తన వినియోగదారుల కోసం ఈఎంఐ చెల్లింపు సౌకర్యాన్ని గురువారం ప్రారంభించింది. రూ.2,999 కంటే ఎక్కువ ఆర్డర్లకు ఈఎంఐ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఒడుదుడుకులు ఉండడంతో మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే కొనసాగాయి.