హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిమ్ బుధవారం తొలి ప్రసంగం చేశారు. మంగళవారమే హసన్ నస్రల్లా వారసుడిగా ఎన్నికయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో కాల్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే నడుచుకుంటానని ప్రకటించారు.
లెబనాన్‌లోని హిజ్బుల్లా యొక్క రద్వాన్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ ముస్తఫా అహ్మద్ షాహదీ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ముస్తఫా అహ్మద్ షాహదీ ఇజ్రాయెల్‌పై అనేక తీవ్రవాద దాడులకు పురికొల్పినట్లుగా గుర్తించారు.
దేశ రాజధాని ఢిల్లీలో పావురాల రెట్టతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో పావురాల ప్రభావిత కేంద్రాలపై నిషేధం విధించడానికి ఆప్ సర్కార్ యోచిస్తోంది. పావురాల రెట్టల కారణంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ గుర్తించింది.
ప్రధాని మోడీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా కుమారుడు ద్రవ్య ధోలాకియా వివాహానికి హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యా్న్ని అందించనున్నారు.
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్యంతో అదరగొట్టారు.
స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వరదలు కారణంగా ఇప్పటి వరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురి ఆచూకీ ఇంకా తెలియలేదు అని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో బుధవారం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. అలాంటిది బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్‌లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు.