యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎంపికైన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లు ప్రభుత్వం నడిపాం కానీ పార్టీని బలపర్చలేదన్నారు. జనవరిలో కమిటీల ఏర్పాటును చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ కు కనిపించడం లేదు.. వినిపించడంలేదని కేటీఆర్ ఎద్దేవ చేశారు. అభివృద్ధి కోసమే పార్టీ మారినం అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే చెప్తున్నారని అన్నారు.
Also Read:Dhurandhar: పాక్‌లో “ధురంధర్” బ్యాన్.. కానీ, వైరల్ సాంగ్‌తో చిన్న భుట్టో ఎంట్రీ..
సీఎం రేవంత్ చెప్పినట్లు స్పీకర్ వింటున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సిగ్గులేదు. అన్ని పదవులు అనుభవించిన పోచారం పార్టీ ఎందుకు మరినారో అర్థం కావడం లేదన్నారు. కడియం కు కమిట్మెంట్ లేదన్నారు. ఎక్కడ పోగొట్టున్నామో అక్కడే వెతుక్కుతున్నాం. పంచాయతీలలో BRS గెలుపు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు. పంచాయతీ ఎన్నికల వివాదాలను కోర్టులో తేల్చుకుంటాం, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. KCR మీద ప్రజలకు, కాంగ్రెస్, బీజేపీ కి కోపం లేదు. పార్టీ నిర్మాణంలో వెనకబడినం.. అందుకే ఓడిపోయామన్నారు. MPTC, ZPTC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి అని ఆకాంక్షించారు.
Also Read:CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..
మనలను మనమే ఓడించుకున్నాం. మన సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే నష్టం జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. మా MLA ఓడిపోయినా.. KCR సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారన్నారు. గెలిచిన సర్పంచ్ ల కోసం జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ సుందరీకరణకు BRS అడ్డుకాదన్నారు. మూసి సుందరీకరణ ఆలోచన BRS పార్టీదే.. STP ల నిర్మాణం పూర్తి చేస్తే.. మూసి సుందరీకరణ చేసినట్టే అని తెలిపారు. మూసి సుందరీకరణ కాంగ్రెస్ చేయకపోతే.. అధికారంలోకి వచ్చాక BRS చేస్తుందన్నారు. విభేదాలు పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో కేడర్ పోరాటం చేయాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.