ఉక్రెయిన్‌పై రష్యా గత రెండేళ్లుగా యుద్ధం సాగిస్తోంది. ఉక్రెయిన్ కూడా దాడులను తిప్పికొడుతోంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను పెంచేందుకు ఉత్తర కొరియా సాయం కోరింది. దీంతో కిమ్‌కు సంబంధించిన సేనలు రష్యాలోకి అడుగుపెట్టాయి. ఈ విషయాన్ని నాటో తాజాగా ధ్రువీకరించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు తెలిపింది. రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలు మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని.. ఈ చర్య ఉన్న పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడమేనని మార్క్ రుట్టే వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. అసలు కిమ్ సైన్యం మద్దతు తీసుకోవడం రష్యా బలహీనతను తెలియజేస్తోందని ఎద్దేవా చేసింది.
ఇది కూడా చదవండి: Maharashtra Polls: టాప్ 10 సంపన్న అభ్యర్థులు వీళ్లే! ఫడ్నవిస్ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..!