రీల్స్ మోజులో పడి కొందరు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రమాదమని తెలిసి కూడా ఎదురెళ్లుతున్నారు. లేనిపోని కష్టాలు తెచ్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి
రైల్వే ట్రాక్‌పై కొందరు మైనర్లు నిలబడి రీల్స్ చేస్తున్నారు. ఇంతలో ట్రైన్ వేగంగా దూసుకొచ్చింది. అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పక్కనే నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ట్రైన్ దగ్గరగా వచ్చి ఢీకొట్టడంతో బాలుడు ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లోని షింగిమారి రైల్వే బ్రిడ్జి దగ్గర ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Nadendla Manohar: రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతాం..
ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. సోషల్ మీడియా పిచ్చిలో పడి ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయొద్దని కోరారు. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుని తల్లిదండ్రులను బాధించొద్దని వేడుకుంటున్నారు. అయినా ఇలాంటి వాటికోసం జనాలు ఎందుకు వెంపర్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఇంకొందరు ధ్వజమెత్తారు. అయితే ఈ వీడియో ఎప్పుడిదో.. ఏంటో తెలియదు. తేదీలేదు. సమయం లేదు. కానీ వీడియో వైరల్ అవుతోంది.
While Making Tiktok Videos A Train Hits the guy in Bangladesh
https://t.co/06kZEovLGn— Ghar Ke Kalesh (@gharkekalesh) October 27, 2024