మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో రాకరేపతున్నాయి. డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి.
భారీ వరదలు స్పెయిన్‌ను అతలాకుతలం చేశాయి. గత 37 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ఘోరంగా వరదలు హడలెత్తించాయి. ఇప్పటికే 100 మంది చనిపోగా.. వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎత్తేస్తున్నారంటూ వచ్చిన వార్తలతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేగింది. దీపావళి పండుగ రోజున మహిళలకు షాక్ తగిలినట్లైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై పున:సమీక్షిస్తామంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ గతేడాది నుంచి యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు సాగిస్తోంది. తాజాగా ఇదే వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌కు కీలక సూచన చేశారు.
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు సంబంధించిన వార్త మరోసారి హల్చల్ చేస్తోంది. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అహ్మద్‌నగర్‌లోని షెవ్‌గావ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్వ్యవస్థాపకుడు టీపీజీ నంబియార్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు కారణంగా గురువారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేదని.. ఈ కారణం చేతనే నంబియార్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
మహారాష్ట్ర ఎన్నికల వేళ హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రవి రాజా.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. హస్తానికి బై బై చెప్పి కమలం గూటికి చేరారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రవి రాజా బీజేపీలో చేరారు.
దీపావళి రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్లో ఎలాంటి మెరుపులు లేవు. వరుసగా రెండో రోజు కూడా నష్టాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు, అమెరికా ఎన్నికల అనిశ్చితి కారణంగా మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను పంపించింది. ఇప్పటికే రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో మోహరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.