సామాన్యుల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు టెలీకాం సంస్థలు ఇష్టానురీతిగా రీఛార్జ్ ధరలు పెంచేశాయి. కానీ కేంద్రం ఆధ్వర్యంలో నడిచే బీఎస్ఎన్ఎల్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు.
భారత్‌లో గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతిరోజు డైలీ సీరియల్లాగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయితే అక్టోబర్ 27న మాత్రం దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో మాత్రం బెల్లెట్లు కలకలం రేపాయి.
ఇజ్రాయెల్.. దాని మిత్రదేశమైన అగ్ర రాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాలపై ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించారు.
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూశారు. 63 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. రోహిత్ బాల్ మృతికి ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంతాపం తెలిపింది. పురుషులు, మహిళలకు ఆయన అందించిన డిజైన్లు బాగా ప్రసిద్ధి చెందాయి. 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన వృత్తిని ప్రారంభించారు.
గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలపై ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 16 వినియోగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు
గోవాలో కాంగ్రెస్ పార్టీకి స్పీ్కర్ రమేష్ తవాడ్కర్ షాకిచ్చారు. బీజేపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన పిటిషన్‌ను కొట్టేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.శుక్రవారం తెల్లవారుజామున 1:07 గంటలకు హాలోవీన్ వేడుకల సందర్భంగా సామూహిక కాల్పులు జరిగాయి.
కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ ఏడాది దీపావళి వేడుకలు వైరటీగా చేసుకున్నారు. మేనల్లుడు రేహాన్ వాద్రాతో కలిసి సామాన్య ప్రజలతో కలిసి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది.