దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్స్టర్లు రెచ్చిపోయారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఏ మాత్రం భయం లేకుండా ముఠా సభ్యులు బరితెగించారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్‌లోకి ప్రవేశించి ఇష్టానురీతిగా గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. అమెరికా ఎన్నికల అనిశ్చితి, పశ్చిమాసియా ఉద్రిక్తలు కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసింది. దాదాపుగా 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు బరిలో నిలుచున్నదెవరో తేలిపోయింది. ఇక ప్రచార రంగంలోకి అభ్యర్థులు దిగనున్నారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇదిలా ఉంటే మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు మోసపూరిత సందేశాలను ఎస్బీఐ ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు 98.04 శాతం నోట్లు ప్రజల నుంచి తిరిగి బ్యాంకులకు వచ్చి చేరినట్లు సోమవారం ఆర్బీఐ తెలిపింది.
స్నేహితులతో సరాదాగా కాసిన పందెం ప్రాణాల మీదకు తెచ్చింది. దీపావళి రాత్రి (అక్టోబర్ 31) బెట్టింగ్ ఛాలెంజ్‌లో భాగంగా శక్తివంతమైన బాణాసంచాపై కూర్చున్నాడు. ఒక్కసారి పేలడంతో ప్రాణాలు పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి నిమిషంలో విచిత్రమైన ట్విస్ట్ జరిగింది. ఉపసంహరణ గడువుకు కొద్ది క్షణాల ముందు కొల్హాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మధురిమా రాజే ఛత్రపతి షాకిచ్చింది. అనూహ్యంగా ఆమె కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇది కూడా చదవండి: AP Assembly: ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మహారాష్ట్రలోని కొల్హాపూర్ […]
మైసూరు భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. బుధవారం విచారణకు రావాలని సమన్లలో పేర్కొంది. దీంతో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)కు సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని లోకాయుక్త ప్రశ్నించనుంది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పశ్చిమబెంగాల్లోని సీల్దా కోర్టు అభియోగాలు మోపింది. సంజయ్ రాయ్‌పై భారతీయ న్యాయ్ సహిత 103(1) లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపింది.