ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూశారు. 63 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారు. దీర్ఘకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రోహిత్ బాల్ మృతికి ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంతాపం తెలిపింది. పురుషులు, మహిళలకు ఆయన అందించిన డిజైన్లు బాగా ప్రసిద్ధి చెందాయి. 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన వృత్తిని ప్రారంభించారు.
రోహిత్ బాల్ భారతదేశంలోని నక్షత్ర డిజైనర్ల జాబితాలో ఎప్పుడూ ఉండే పేరు. 25 సంవత్సరాలకు పైగా ఫ్యాషన్ పరిశ్రమలో ఉన్నారు. లేబుల్ ‘రోహిత్ బాల్’ క్రింద విలాసవంతమైన దుస్తులను రూపొందించడంలో ప్రసిద్ది చెందారు. వివాహ లెహంగాలు, చీరల నుంచి షేర్వాణీలు మరియు జాకెట్ల వరకు చక్కని నైపుణ్యం కలిగిన వారు. బాల్ తన కంటూ చక్కటి పనితో సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఫ్యాషన్ ఈవెంట్‌లో ‘డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదును అందుకున్నారు.
రోహిత్ బాల్.. మే 8, 1961లో జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. శ్రీనగర్‌లోని వుడ్‌ల్యాండ్స్ హౌస్ స్కూల్, బర్న్ హాల్ స్కూల్‌లో బాల్ విద్యను అభ్యసించారు. 1970లో ఇస్లామిస్ట్ తిరుగుబాటు కారణంగా అతని కుటుంబం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అనంతరం మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ విద్యను నేర్చుకున్నారు. 1986లో సోదరుడు రాజీవ్ బాల్‌తో కలిసి ఢిల్లీలో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేటు లిమిటెడ్ ప్రారంభించారు.
Fashion Design Council of India condoles the demise of renowned Fashion Designer Rohit Bal. pic.twitter.com/2vthbFQtEs
— ANI (@ANI) November 1, 2024