మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు.
ఆర్గానికి క్యారెట్లు అగ్రరాజ్యం అమెరికాను హడలెత్తిస్తు్న్నాయి. ఆర్గానికి క్యారెట్లలో హానికరమైన ఇ కోలి వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇప్పటికే ఒకరు చనిపోగా.. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు.
దేశీయ విమాన రంగ చరిత్రలో తొలిసారి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు ప్రయాణాలు చేశారు. ఒకే రోజులు 5 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం.
దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. గత వారమంతా భారీ నష్టాలు కారణంగా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ వారమైనా మార్పు ఉంటుంది అనుకుంటే.. ఈ వారం కూడా అదే తంతు కొనసాగుతోంది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని ప్రధాన కార్యాలయాన్ని మరొక చోటకు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు సమీపంలోకి మారుస్తోంది.
సోషల్ మీడియా మోజులో పడి యువత ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే వ్యూస్ కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర స్టంట్లు చేసి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఇల్లు, బడి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ.. ఇష్టానురీతిగా పబ్లిక్‌కి ఇబ్బంది కలిగించే విధంగా రీల్స్ చేస్తూ విసుగు పుట్టిస్తున్నారు.
ఇరాన్ అణు పరిశోధనా కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే తెలుస్తోంది. అక్టోబర్ చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడితో పెద్ద ఎత్తునే ముప్పు వాటిల్లినట్లుగా తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఆందోళనకరంగా మారింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అంత భయంకరంగా వాతావరణం పొల్యూషన్ అయిపోయింది. ఇక చిన్న పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. జ
శాంసంగ్ కస్టమర్లకు కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రీన్ లైన్ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు ఉచితంగా అందించే స్క్రీన్ రీప్లేస్మెంట్ గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. మొబైల్ స్క్రీన్‌లో సమస్య ఉన్న వారికి ఉచితంగా అందిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. జనవరి 1, 2025 నుంచి పోర్ట్‌ఫోలియోలోని మొత్తం మోడల్ శ్రేణిపై భారతదేశంలో తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు శుక్రవారం తెలిపింది.