దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. గత వారమంతా భారీ నష్టాలు కారణంగా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ వారమైనా మార్పు ఉంటుంది అనుకుంటే.. ఈ వారం కూడా అదే తంతు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా అలాగే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77, 339 దగ్గర ముగియగా.. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 23, 453 దగ్గర ముగిసింది. నిఫ్టీలో ఎనర్జీ, హెల్త్‌కేర్, ఐటీ నష్టాలను చవిచూడగా.. ఆటో, ఎఫ్‌ఎంసీజీ స్వల్ప లాభాల్లో ముగిశాయి.
ఇది కూడా చదవండి: Natural Star Nani: మాలీవుడ్‌ను టార్గెట్ చేసిన న్యాచురల్ స్టార్.. స్పీడ్ ఎక్కువైందా?
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు ముందు అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఎన్నికల తర్వాత డొనాల్డ్ ట్రంప్ జయకేతనం తర్వాత స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంటుందని నిపుణులు భావించారు. నవంబర్ 6న అమెరికా ఎన్నికల ఫలితాల రోజున తప్ప.. ఇంకెప్పుడు మార్కెట్ పుంజుకోలేదు. వరుస నష్టాలను ఎదుర్కొంటుంది. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ వారమైనా సూచీలు పుంజుకుంటాయని ఆర్థిక నిపుణులు భావించారు. కానీ ఎక్కడా మార్పు చోటుచేసుకోలేదు. గత వారం ఉన్న ఒరవడే.. ఈ వారం కొనసాగుతుంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: మహారాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ హామీలు.. వీలైనంత త్వరగా అమలు చేస్తాం..