వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు.
హిజ్బుల్లా ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు సాగిస్తోంది. ఈ వారం జరిగించిన దాడుల్లో 200 మంది హిజ్బుల్లా ఉగ్రవాదులు హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. 140 రాకెట్ లాంఛర్లను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గురువారం పేర్కొంది.
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (60) లేటు వయసులో మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రియురాలు లారెన్ శాంచెజ్ (54)ను త్వరలోనే ఆయన వివాహం చేసుకోనున్నారు. క్రిస్మస్ రోజున వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రకృతిలో తల్లి ప్రేమ అనేది అపురూపమైనది. అది వెలకట్టలేనిది. మనిషైనా, జంతువైనా, ఆకాశ పక్షులైనా తల్లి ప్రేమలో ఏ మాత్రం తేడా ఉండదు. తమ బిడ్డల కోసం శత్రువుతో ఎంతకైనా తెగించి పోరాడతారు. ఇలాంటి ఘటనే తాజాగా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక అశ్లీలత విపరీతంగా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియా సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఒక ప్రవాహంలా అశ్లీలత ప్రవహిస్తోంది. జుగుప్సకరమైన దృశ్యాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.
దేశీయ స్టా్క్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు కారణంగా సూచీలు అప్రమత్తత పాటిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా దాదాపు రూ.13 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది.
రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నందుర్బార్లో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడారు.
అమెరికా ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. తదుపరి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే సంప్రదాయబద్ధంగా నూతనంగా ఎన్నికైన ట్రంప్‌తో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు.