మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మహారాష్ట్రలో 45 శాతం, జార్ఖండ్‌లో 61 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. ఇక ముంబైలో సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు తరలివచ్చారు.
భారత్-చైనా మధ్య మెల్లమెల్లగా సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయి. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి భారత్-చైనా బోర్డర్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు.
నార్వే యువరాణి మెట్టే మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ(27) అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. రేప్ కేసులో హోయిబీని సోమవారం ఓస్లోలో పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్రెజిల్లో వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం కుటుంబానికి వింతైన పరిస్థితి ఏర్పడింది. బ్రెజిల్ వీధుల్లో నడుచుకుంటూ వస్తుండగా ఆమె తల్లి బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో లిసిప్రియ, ఆమె తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాంబ్ తుఫాన్ అగ్ర రాజ్యం అమెరికాను హడలెత్తిస్తోంది. అత్యంత శక్తివంతమైన సైక్లోన్ అనేక రాష్ట్రాలపై ప్రభావం చూపించనున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గాజాలో పరిస్థితులు అత్యంత ఘోరంగా తయారయ్యాయి. గతేడాది ప్రారంభమైన యుద్ధంతో గాజా పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆహార కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.