Iran-Israel: ఇరాన్ అణు పరిశోధన కేంద్రాన్ని ఐడీఎఫ్ ధ్వంసం చేసినట్లు కథనాలు!
- ఇరాన్ అణు పరిశోధన కేంద్రం ధ్వంసం
- ఐడీఎఫ్ ధ్వంసం చేసినట్లు కథనాలు!
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ అణు పరిశోధనా కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే తెలుస్తోంది. అక్టోబర్ చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడితో పెద్ద ఎత్తునే ముప్పు వాటిల్లినట్లుగా తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్‌లోని పార్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లోని క్రియాశీలకమైన అణ్వాయుధ పరిశోధన కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేసినట్లుగా ముగ్గురు యూఎస్ అధికారులు, ఇజ్రాయెల మాజీ అధికారి ఉటంకిస్తూ తాజాగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి.
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతం చేసిన తర్వాత ఇరాన్ ప్రతీకారంగా అక్టోబర్ ప్రారంభంలో 180 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. అయితే గగనతలంలోనే ఈ రాకెట్లను ఐడీఎఫ్ ధ్వంసం చేసింది. కొన్ని మాత్రం టెల్ అవీవ్ ప్రాంతంలో పడినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఐడీఎఫ్ తెలిపింది. అయితే ఇరాన్ చర్యపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తప్పు చేసిందని.. ప్రతీకార చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. అన్నట్టుగానే అక్టోబర్ చివరిలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. అయితే ఇరాన్ మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. తాజా నివేదికలను బట్టి అణ్వాయుధ పరిశోధన కేంద్రం ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామం ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి పౌరులను బందీలుగా తీసుకుపోయింది. ఆరోజు నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడింది. గాజా పట్టణాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అంతేకాకుండా హమాస్ అగ్ర నేతలందరినీ హతం చేసింది. ఇక హమాస్‌కు మద్దతుగా కాలుదువ్విన హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై కూడా ఐడీఎఫ్ దళాలు దాడుల చేశాయి. హిజ్బుల్లా అగ్ర నేతలను హతం చేసింది. ప్రస్తుతం హమాస్, హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.
BREAKING – Israel destroyed active nuclear weapons research facility in Iran, officials say – Axios pic.twitter.com/iXWYjOOJFz
— Insider Paper (@TheInsiderPaper) November 15, 2024
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!