మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకుని పోలింగ్ బూత్‌లకు తరలి వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక హెలికాప్టర్లలో సిబ్బందిని తరలిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా విరుచుకుపడింది. టెల్ అవీవ్‌పై హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. పలువురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.
దేశీయ స్టాక్ మార్కెట్లో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా సూచీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. మొత్తానికి వారం రోజుల తర్వాత మంగళవారం మన మార్కెట్‌కు మంచి రోజులొచ్చాయి.
ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. అక్టోబర్ చివరిలో అకస్మా్త్తుగా ఇరాన్ అణు స్థావరాలపై ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కిపడింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై రాళ్లతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌ను తరలించే సమయంలో పోలీసులు వింతగా వ్యవహరించారు. అతడి అరుపులు వినపడకుండా ఏకధాటిగా హారన్లు మోగిస్తూ ఉన్నారు. దీంతో అతడి అరుపులు వినపడకుండా పోయాయి.
టెలికాం రంగంలో జియో దూసుకుపోతుంది. తాజాగా జియో కొత్త వోచర్‌ను తీసుకొచ్చింది. సంవత్సరం పాటు ఏకధాటిగా 5జీ డేటాను వినియోగించుకోవడానికి రూ.601తో అన్లిమిటెడ్ 5జీ అప్‌గ్రేడ్ వోచర్‌ను తీసుకొచ్చింది. 4జీ వినియోగదారులు కూడా ఈ వోచర్ సాయంతో 5జీ సేవలను ఆనందించే అవకాశం కల్పించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ విచ్చలవిడిగా దుబారా ఖర్చులు చేసినట్లుగా ద టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. ఐస్ క్రీములు, పుడ్ డెలివరీకే 24 వేల డాలర్లు (రూ.20,27,465) ఖర్చు పెట్టినట్లు తెలిపింది.
బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత సరసమైన ధరకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 11వ ఎస్బీఐ బ్యాంకింగ్ మరియు ఎకనామిక్స్ కాన్క్లేవ్ 2024లో సీతారామన్ పాల్గొని మాట్లాడారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. సెన్సార్ లేకపోవడంతో ఇష్టానురీతిగా వీడియోలు పోస్టులు చేస్తున్నారు.