ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని ప్రధాన కార్యాలయాన్ని మరొక చోటకు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు సమీపంలోకి మారుస్తోంది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హెడ్‌క్వార్టర్స్ తరలింపుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బెంగళూరు నగర శివారులోకి 20 కి.మీ దూరంలోకి తీసుకెళ్లడంపై ఎంప్లాయిస్ నిరాశలో ఉన్నారు. కొత్త కార్యాలయానికి పగటిపూట వెళ్లాలంటే 80 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు షాపింగ్ మాల్స్, ఫైవ్-స్టార్ హోటల్స్, ఆస్పత్రి, స్కూల్స్, ఇతరత్రా సౌకర్యాలన్నీ కోల్పోనున్నారు. ఈ కారణాల చేత ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బలవంతంగానే ఉద్యోగులు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Minister Rama Naidu: రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం..
అమెజాన్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం మల్లేశ్వరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యంలోని 30 అంతస్తుల భవనంలో 18 అంతస్తుల్లో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెజాన్ ఖాళీ చేస్తుండటంతో అంత భారీ విస్తీర్ణాన్ని కొత్తగా ఎవరు తీసుకుంటారో తెలియదు. ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.250 చొప్పున చెల్లిస్తుండగా కొత్త భవనంలో మూడింట ఒక వంతు కంటే తక్కువే ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలోనే డబ్బు ఆదా చేసేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆఫీస్ తరలింపు వచ్చే ఏడాది ఏప్రిల్, 2026 నాటికి పూర్తి చేయనుంది. ఇక కొత్త కార్యాలయం తరలిస్తే.. ఎయిర్‌పోర్టు నుంచి కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కరోనా సమయంలో ఆయా కంపెనీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. లాక్‌డౌన్ సమయంలో నష్టాలను కూడా చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే ఖర్చులను తగ్గించుకునేందుకు అమెజాన్ ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం హెడ్‌క్వార్టర్స్‌లో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారంతా కూడా కొత్త ఆఫీసుకు వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే హెడ్‌క్వార్టర్స్‌కు దగ్గరలోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ఆఫీసుకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: Amit Shah: సత్యం చీకటిలో ఎప్పటికీ దాగదు.. ‘ది సబర్మతి రిపోర్ట్’పై కేంద్రమంత్రి ప్రశంసలు