మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు. ఇక ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు వరకు ప్రచారం నిర్వహించారు. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా ప్రచారం చేపట్టారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నేతలంతా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. సోమవారంతో ప్రచారమైతే ముగిసింది. ఇక పోలింగ్ మిగిలి ఉంది.
ఇది కూడా చదవండి: Thandel Bujji Thalli: నవంబర్ 21న వచ్చేస్తోన్న తండేల్ ‘బుజ్జి తల్లి’
ఇక చివరి రోజు పేపర్లలో వచ్చిన ప్రకటనలు కాకరేపాయి. కర్ణాటక ప్రభుత్వ పథకాలపై ఎన్డీఏ కూటమి ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలు చివరి రోజు తీవ్ర దుమారమే రేపాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న గ్యారంటీ పథకాలను మహారాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు జారీ చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఓట్ల కోసం ఆ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మహాయుతి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధ్వంజమెత్తారు. మహాయుతి ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Javier Aguirre: బీర్ క్యాన్‌లతో కోచ్ పై దాడి.. తలపై రక్తస్రావం
నవంబర్ 20న మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి విడత పోలింగ్ ముగిసింది. చివరి విడత బుధవారం జరగనుంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫస్ట్ ఫేజ్‌లో 43 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు బుధవారం జరగనుంది. ఇక మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. ఈసారి ప్రజలు ఎవరికి పట్టంకడతారో చూడాలి.
ఇది కూడా చదవండి: Pakistan: తీవ్ర గాలి కాలుష్యం.. పాకిస్తాన్‌లోని ఈ నగరాల్లో లాక్డౌన్