ఓట్లు, సీట్లు కారణంగానే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని ప్రధాని మోడీ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతం గొప్ప సంస్కృతి, చైతన్యవంతమైన వ్యక్తులతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే అపారమైన సామర్థ్యంతో ఉందన్నారు. గత ప్రభుత్వాలు చాలా కాలంగా ఓట్ల సంఖ్యతో అభివృద్ధిని ఎలా తూకం వేశాయో చూశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు తక్కువగా ఉండటంతో గత పాలకులు అభివృద్ధిపై దృష్టిపెట్టలేదని దుయ్యబట్టారు. రాబోయే రోజులన్నీ.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలదేనని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాగానే గౌహతి, షిల్లాంగ్, ఇంఫాల్, ఇటానగర్, ఐజ్వాల్ వంటి ప్రాంతాలు వృద్ధికి కొత్త వెలుగులు నింపుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Vijay Diwas: 50 ఏళ్లలో తొలిసారిగా.. విజయ్ దివాస్‌కి బంగ్లాదేశ్ ముక్తి యోధులు గైర్హాజరు..
ఢిల్లీ.. ఈశాన్య ప్రాంత ప్రజల మనస్సులకు దూరమనే భావనను తగ్గించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పట్నుంచి ప్రయత్నించామన్నారు. ఈ దశాబ్ద కాలంలో కేంద్రమంత్రులు 700 సార్లు ఇక్కడ పర్యటించారని, ప్రజల మనోభావాలు, ఆర్థిక వ్యవస్థ, జీవావరణంతో ఈశాన్య ప్రాంతాలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. అష్టలక్ష్మీ మహోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 8 వరకు జరుగుతాయన్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర మరియు సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలలోని ఎనిమిది రాష్ట్రాల అందం, వైవిధ్యం మరియు వాగ్దానాన్ని ప్రదర్శించడం లక్ష్యం అన్నారు. అందరినీ అష్టలక్ష్మీ మహోత్సవాలు కలిపాయని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Nana Patole: ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు