BJP: రేపు ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ
- మంగళవారం లోక్‌సభలోకి జమిలి ఎన్నికల బిల్లు
- ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని బీజేపీ విప్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ హైకమాండ్ ఎంపీలకు విప్ జారీ చేసింది. మంగళవారం ఎంపీలంతా లోక్‌సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17, 2024న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సభలో చర్చకు రానున్నందున పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలందరికీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. మంగళవారం ‘ఒక దేశం ఒకే ఎన్నికల’ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును మంగళవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లు ఆమోదం పొందాలంటే “129వ రాజ్యాంగ సవరణ బిల్లు”, “1963లో చేసిన “కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు” సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బిల్లులను మొత్తం 32 పార్టీలు సమర్థిస్తుంటే.. 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
లోక్‌సభలో బలాబలాలు
ఎన్డీఏ కూటమికి (బీజేపీ 240+మిత్రపక్షాలు 53) మొత్తం 293 స్థానాలు ఉన్నాయి.
బిల్లు ఆమోదం పొందాలంటే 364 సభ్యుల మద్దతు ఉండాలి
అంటే బిల్లుల ఆమోదానికి ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి
కానీ ప్రస్తుతం అధికార పార్టీకి సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది
ఇక రాజ్యసభలో బలాబలాలు
రాజ్యసభలో మొత్తం 245 సభ్యులున్నారు
ఎన్డీఏ కూటమికి 112 మంది సభ్యులు ఉన్నారు.
ప్రతిపక్ష (ఇండియా) కూటమికి 85 సభ్యులు ఉన్నారు
ఇక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే అధికార పార్టీకి 164 మంది సభ్యులు ఉండాలి
అంటే మూడింట రెండొంతుల బలం కావాలి
ఉభయ సభల్లోనూ అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదు. కేవలం సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది.
ఇక జమిలి బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టగానే “సంయుక్త పార్లమెంటరీ కమిటీ” ( జేపీసీ) పరిశీలనకు వెళ్తాయి. అలాగే 23 వ “లా కమిషన్” అభిప్రాయాలను, సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 50 శాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా పొందాల్సి ఉంటుందని రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించి, అన్ని పార్టీల మద్దతుతో బిల్లులకు చట్ట రూపం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఒకవేళ రెండు బిల్లులు ఆమోదం పొందితే 2029లో దేశంలోని అన్ని చట్ట సభలకు (లోకసభ, అసెంబ్లీ) ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఇదే జరిగితే దేశ రాజకీయ వ్యవస్థకు, రాజకీయాలకు జమిలి ఎన్నికలు సరికొత్త రూపునివ్వనున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!