బెంగళూరులో దారుణం జరిగింది. ప్రైవేట్ ఫొటోలతో మామ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో మహిళా టెక్కీ ప్రాణాలు తీసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు నడుస్తోంది. నామినేషన్ల సమర్పణకు గడువు దగ్గర పడింది. ఇంకోవైపు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తు్న్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఇప్పటికే దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా 10 దేశాలకు చెందిన ప్రతినిధులు పవిత్ర స్నానాలు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇద్దరూ కూడా గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారని సమాచారం.
ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దొంగతనానికి వచ్చిన అగంతకుడు.. సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేయగా.. ఆరు కత్తిపోట్లు పడ్డాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వరుస నష్టాలను చవిచూసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అయితే సంక్రాంతి వేళ మార్కెట్‌కు కొత్త జోష్ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక అందించింది. ఉద్యోగులందరికీ 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.