ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. రోజురోజుకి మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కొలిక్కి వచ్చినట్లు మంగళవారం ఖతర్ తెలిపింది. ఇందుకు హమాస్ అంగీకరించినట్లు పేర్కొంది. బందీలను అప్పగించేందుకు హమాస్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
కనుమ పండుగ రోజున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. తాజాగా ఇదే అంశంపై బుధవారం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం అతిషి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నామినేషన్లు దాఖలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి హనుమాన్, వాల్మీకి ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు.
ఆటో డ్రైవర్లకు-ప్యాసింజర్ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరగడం చూస్తుంటాం. ఆటో ఎక్కించుకున్నాక.. మధ్యలో దింపేయడం.. లేదంటే డబ్బుల విషయంలో ఘర్షణ తలెత్తడం జరుగుతుంటాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో సంక్రాంతి రోజున లాభాల బాట పట్టిన సూచీలు.. రెండో రోజుగా కూడా అదే ఊపు కనిపించింది. కనుమ రోజున కూడా ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి దాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి.
కనుమ పండుగ రోజున మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఫిబ్రవరి 14 వరకు పూజా ఖేద్కర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌లు బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వానికి, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.