ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రస్తుతం మహా కుంభమేళ జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు, సాధువులు పెద్ద సంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే.. తాజాగా సోషల్ మీడియాలో మహిళా సాధ్వి అందరినీ ఆకర్షిస్తోంది. మెడలో రుద్రాక్ష హారం, పువ్వుల మాల ధరించి నుదిటిపై తిలకంతో ఆకర్షణగా నిలిచింది. ఆమె అందానికి అందరూ ముగ్ధులవుతున్నారు. దీంతో చాలా మంది ఆమె ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతున్నారు.
ఇది కూడా చదవండి: Tata Nexon 2025: కొత్త అవతార్‌లో నెక్సాన్ 2025 లాంచ్.. బ్రెజ్జా, వెన్యూ, సోనెట్‌లకి గట్టి పోటీ..
1994 మార్చి 26న మధ్యప్రదేశ్‌లో హర్ష రిచార్య జన్మించారు. మోడల్, యాంకర్, వెడ్డింగ్స్‌లో హోస్ట్‌గా పని చేసింది. అనేక ఆధ్యాత్మిక ఆల్బమ్స్‌లో కూడా నటించింది. అయితే రెండేళ్ల కిందట ఇవన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో కొత్త జీవితం ప్రారంభించింది. తన వయసు 30 ఏళ్లని.. రెండేళ్లుగా సాధ్విగా జీవిస్తున్నట్లు హర్ష రిచార్య తెలిపింది. తాను నిరంజని అఖారాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర స్వామి శ్రీ కైలాసానందగిరి మహారాజ్ శిష్యురాలనని తెలిపింది. ఆయన మార్గదర్శకత్వంలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.
హర్ష రిచార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో 9 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రొఫైల్‌లో మతపరమైన, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన కంటెంట్ షేర్ చేస్తుంది. కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై నిరసన వ్యక్తం చేసిన ఫొటోలను షేర్ చేసింది.
ఇది కూడా చదవండి: Cock Fighting: సైలెంట్‌గా నిలబడి.. 1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు!
About For Viral Video
महाकुंभ में आई बहुत ही खूबसूरत साध्वी
पत्रकार ने पूछा आप इतनी सुन्दर हैं तो साध्वी क्यों बनीं? pic.twitter.com/dEzhqNfqY6— Shubhangi Pandit (@Babymishra_) January 12, 2025