పతంజలి ఆయుర్వేద వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్, సంస్థ ఎండీ బాలకృష్ణకు కేరళ కోర్టు షాకిచ్చింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
పాఠశాల దశలోనే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన అవసరం అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ తెలిపారు. రోడ్ సేఫ్టీ విషయంలోప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు దృష్టి మళ్లించి ఏటీఎం కార్డులు దొంగిలించి నగదు దోచుకుంటున్న ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం కార్డులు, రూ.7.6 లక్షల నగదు, ఒక నకిలీ పోలీస్ ఐడీ కార్డను స్వాధీనం చేసుకున్నారు.
మందు బాబులకు బీర్ల సంస్థ శుభవార్త చెప్పింది. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.
ప్రయాణికులకు బెంగళూరు మెట్రో షాకిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడంతో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మెట్రో రైలు ఛార్జీలను పెంచింది.
ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 23 ఏళ్ల టీవీ నటుడు అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. ధర్తీపుత్ర నందిని అనే సీరియల్లో అమన్ జైస్వాల్‌కు మంచి పేరు వచ్చింది.
ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు.
ఎందరో త్యాగధనుల ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
పార్లమెంట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.