ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు మార్మోగుతోంది. ఢిల్లీ బ్లాస్ట్‌లో పాల్గొన్న అనుమానిత వైద్యులు అల్ ఫలాహ్‌లోనే పని చేస్తున్నారు. పట్టుబడ్డ వైద్యులు.. యూనివర్సిటీలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై అనేక కథనాలు వెలువడుతున్నాయి.
ఒక ఇల్లు నిర్మించాలంటే దాని వెనుక ఎంతో కష్టం.. ఎంతో శ్రమ. ఎంతో డబ్బు ఖర్చు ఉంటుంది. ఇక హైదరాబాద్‌లాంటి మహా నగరంలో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. అనుకున్న బడ్జెట్ దాటిపోతే అప్పో.. సొప్పో చేసి మరి ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘గోడి మీడియా’ చేస్తున్న తప్పుడు సర్వేలు అని ధ్వజమెత్తారు. బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బీహార్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. రెండు విడతలు జరిగిన ఓటింగ్‌లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడతలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో రికార్డ్ స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి.
భూటాన్‌లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ప్రపంచ శాంతి ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొన్నారు. థింఫులో భూటాన్ మాజీ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో కలిసి ‘కాలచక్ర అభిషేక’ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
ఢిల్లీ బాంబ్ పేలుడు యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ప్రశాంతంగా ఉన్న దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు బ్లాస్ట్ అయింది. పెద్ద ఎత్తున విస్ఫోటనం జరగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు.
ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు.. తాజాగా బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్‌కు సరికొత్త జోష్ వచ్చింది. బీహార్‌లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది.
వైద్య వృత్తి.. ఇది పవిత్రమైన వృత్తి. అందరూ చేతులెత్తి దండం పెట్టే వృత్తి. సమాజంలో వైద్య వృత్తికి అంత గౌరవం ఉంటుంది. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న వైద్యులు.. ఉగ్రవాదులుగా మారడం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా ఢిల్లీ పేలుడు తర్వాత వెలుగులోకి వస్తున్న సంఘటలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త రోమన్ నోవాక్, అతని భార్య అన్నా నోవాక్ దుబాయ్‌లో హత్యకు గురయ్యారు. దుబాయ్ ఎడారిలో శరీరం ముక్కలు ముక్కలుగా నరికివేయబడినట్టుగా మృతదేహాలు కనిపించాయి. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.