Tejashwi Yadav: గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
- గోడి మీడియాను నమ్మొద్దు
- సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘గోడి మీడియా’ చేస్తున్న తప్పుడు సర్వేలు అని ధ్వజమెత్తారు. బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో ఈ సర్వేలు వచ్చాయన్నారు. ‘SIR’ సమయంలో గోడి మీడియా బీహార్‌లోకి ప్రవేశించి చేసిన సర్వేగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: కూటమిలో జోష్.. భారీగా లడ్డూలు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు
Also Read
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
నవంబర్ 14న ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని.. నవంబర్ 18న ప్రమాణస్వీకారం ఉంటుందని తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రాత్రి 7 గంటలకు పోలింగ్ ముగిస్తే.. అంతక ముందే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయని.. ఓటింగ్ ముగియకుండానే సర్వేలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌పై కీలక విషయాలు.. దర్యాప్తులో కొత్త మిస్టరీ!
మాకు అందుతున్న సమాచారం మేరకు ఫలితాలు మహాఘట్‌బంధన్‌కు సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. 1995 ఎన్నికల కంటే మెరుగ్గా ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీహారీయులంతా అధికార కూటమిపై విసుగుపోయారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో మార్పు రాబోతోందని.. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి విడత నవంబర్ 6న జరగగా.. రెండో విడత నవంబర్ 11న జరిగింది. ఎన్నికల ఫలితాలు శుక్రవారం (14-11-2025) విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. ఎన్డీఏ కూటమి మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే రంగంలోకి దిగింది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏకు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నేతలు జోష్‌లో ఉన్నారు.
#WATCH | Patna: On #BiharElection2025 Exit Polls, RJD leader and Mahagathbandhan CM face Tejashwi Yadav says, "We neither rejoice nor harbour any misconception over surveys. These surveys are just psychological pressure, brought under pressure by officers…The surveys have been… pic.twitter.com/qe9mGjfF0T
— ANI (@ANI) November 12, 2025
#WATCH | #BiharElection2025 | Patna: RJD leader and Mahagathbandhan CM face Tejashwi Yadav says, "We had said earlier that results will come on 14th Nov and there will be oath ceremony on 18th Nov. This is definitely going to happen. The feedback that we have been receiving has… pic.twitter.com/BihqThbbwf
— ANI (@ANI) November 12, 2025
#WATCH | #BiharElection2025 | Patna: RJD leader and Mahagathbandhan CM face Tejashwi Yadav says, "…The feedback that we have been getting is very positive. This is better than the 1995 elections' feedback. There was a high voter turnout and people voted against this Govt. There… pic.twitter.com/nQ7Vw93C8i
— ANI (@ANI) November 12, 2025
తాజావార్తలు
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!