Delhi Car Blast: 17వ నెంబర్ భవనం.. రూమ్ నెం.13.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న మిస్టరీ
- తీగ లాగితే డొంకంతా కదులుతోంది
- 17వ నెంబర్ భవనం.. రూమ్ నెం.13
- ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర కుట్ర వెనుక ఉన్న మిస్టరీ అంతా బయటకొస్తోంది. ఇప్పటికే కీలక సమాచారాన్ని రాబట్టిన దర్యాప్తు సంస్థలు.. తవ్వేకొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరిన్ని విషయాలు బయటకొచ్చాయి.
ఇది కూడా చదవండి: Bihar Elections: రేపే బీహార్ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ప్రధానంగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగినట్లుగా గుర్తించారు. దేశ వ్యాప్తంగా నాలుగు నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా తేలింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమ్మిల్ డైరీల్లో ఈ ఉగ్ర ప్రణాళికను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇది కూడా చదవండి: Wedding Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై కత్తి దాడి.. నిందితుల్ని 2 కి.మీ వెంటాడిన డ్రోన్
ఈ ఉగ్ర కుట్రకు యూనివర్సిటీలోని 17వ నెంబర్ భవనాన్ని ఉపయోగించుకున్నట్లుగా కనిపెట్టారు. ఈ భవనంలో ముజమ్మిల్‌కు 13వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లుగా తేలింది. గదిలో కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఉమర్‌కు 4వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచి కూడా మూడు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీల్లో పలువురి పేర్లు ఉన్నాయి. అలాగే దాడులకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఒకేసారి దాడులు జరిపేందుకు మూడు కార్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక కారు ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఇంకో కారు ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
మొత్తం 8 మందితో దేశ వ్యాప్తంగా దాడులు చేసేందుకు సిద్ధం చేసుకున్నట్లు డైరీల నుంచి సేకరించిన సమాచారంతో అధికారులు కనిపెట్టారు. ఎనిమిది మందిలో ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాడుల బాధ్యతలను పూర్తిగా ఉమర్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రణాళిక అమలు కోసం మొత్తం రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బుతోనే అన్ని పరికరాలు సేకరించి.. పేలుడు పదార్థాలు సేకరించినట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!