Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
- వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే
- హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెట్టు మంచిదైతే దాని కాయ కూడా మంచిదని ఎంచాలని పెద్దలు అంటుంటారు. అసలు చెట్టే మంచిది కాదన్నప్పుడు కాయ ఎలా మంచిది అవుతుంది. కానే కాదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ప్రస్తుతం ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ‘‘అల్-ఫలాహ్ యూనివర్సిటీ’ పేరు. విశ్వవిద్యాలయం అంటే విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేది. కానీ అల్-ఫలాహ్ యూనివర్సిటీ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ విశ్వవిద్యాలయం కేంద్రంగానే డాక్టర్ల బృందం దేశ వ్యాప్త దాడులకు ప్రణాళికలు రచించారు. దీనికి ప్రధాన కారణం.. పునాది స్థాపకుడే ఒక పెద్ద విషవృక్షం. చెట్టే మంచిది కానప్పుడు కాయలు ఎలా మంచివి అవుతాయి. ఇక అసలు విషయంలోకి వెళ్లిపోతే…
జావాద్ అహ్మద్ సిద్ధిఖీ..
జావాద్ అహ్మద్ సిద్ధిఖీ (61).. ఇతడే అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయ స్థాపకుడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లోనే ఈ యూనివర్సిటీ ఉంది. ‘‘అల్-ఫలాహ్’’ అంటే అరబిక్‌లో విజయం, శ్రేయస్సు అని అర్థం. ఇక జావాద్ నవంబర్ 15, 1964లో జన్మించాడు. హమ్మద్ అహ్మద్ సిద్ధిఖీకి పుట్టిన ముగ్గురు కుమారుల్లో జావాద్ ఒకడు. మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో పెరిగాడు. ఇది భీమ్‌రావ్ అంబేద్కర్ జన్మస్థలం. ప్రస్తుతం ఈ పట్టణం పేరు కూడా మార్చబడింది. ఇక జావాద్ ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్, ప్రొడక్ట్ డిజైన్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం జావాద్ కుటుంబం ఢిల్లీకి మకాం మారింది. ఇక 1993లో జామియా మిలియా ఇస్లామియాలో మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్‌గా జావాద్ పని చేయడం ప్రారంభించాడు. ఇక్కడే అతగాడి కలలు పెరిగాయి. తన ఆశయాలను విస్తరించేందుకు ప్రణాళికలు రచించాడు.
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి

జావాద్ లెక్చరర్‌గా పని చేస్తుండగా అల్-ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రారంభించాడు. కొద్దికాలంలోనే సంస్థ బహుగా పురోగతి సాధించింది. ఆయా ప్రాంతాల్లో డజను వెంచర్లు విస్తరించాయి. దీనికి జావాదే డైరెక్టర్, ఛానలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ యూనివర్సిటీలో చదివే విద్యార్థులంతా జావాద్‌నే రోల్‌మోడల్‌గా తీసుకుంటారు. అంతగా పాపులరిటీని సాధించాడు. ఇక జావాద్.. జామియా నగర్‌లో ఒక విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. అల్-ఫలా హౌస్‌గా పిలవబడే ఈ ఇంట్లోనే ప్రతి ఏడాది చాలా గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంటాడు. ఈ ఏడాది కూడా చాలా గ్రాండ్‌గా వేడుకలు జరుపుకునేందుకు ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఇంతలోనే ఢిల్లీ బాంబ్ పేలుడుతో యూనివర్సిటీ భండారం బయటపడింది.

ఇక జామియా నగరం కేంద్రంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని జావాద్ విస్తరించాడు. తన సోదరుడైన సౌద్‌తో కలిసి కొన్ని చిన్న కంపెనీలను కూడా స్థాపించాడు. ఇందులో ప్రధానంగా అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకటి ఉంది. అయితే ఇందులో పెట్టుబడులు పెడితే అధిక రాబడి వస్తుందంటూ జావాద్ నమ్మ బలికాదు. దీంతో చాలా మంది పెట్టుబడులు కూడా పెట్టారు. అంతే ఇదే అదునుగా భారీ మోసానికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా పెట్టుబడులన్నింటీని అపహరించాడు. దీంతో 2000లో ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో కేఆర్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు (నం.43/2000) ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఈ కేసును ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేసి జావాద్‌ను అరెస్ట్ చేసింది. సోదరుడు సౌద్‌తో కలిసి మూడేళ్లు జావాద్ జైల్లో ఉన్నాడు. 2023 మార్చిలో బెయిల్‌కు అప్లై చేసుకుంటే తిరస్కరణకు గురైంది. పెట్టుబడులను వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తేల్చింది. చివరికి 2004లో బెయిల్ లభించింది. ఇక అంతలోనే 2005లో పాటియాలా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. పెట్టుబడిదారులకు తిరిగి డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నిర్దోషిగా విడుదల చేసింది.
ఇక ఫరీదాబాద్‌లో స్థాపించిన కళాశాలను.. అనంతరం అల్-ఫలాహ్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌గా 2019లో తరగతులు ప్రారంభం అయ్యాయి. చౌకగా వైద్య విద్యను అందించడంతో చాలా మంది విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసించారు. మైనారిటీ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. ఇక ఇందులో చదివిన కొంత మంది హిందు విద్యార్థులు కూడా ముస్లింలుగా మారారని.. హిజాబ్‌లు, బుర్ఖాలు ధరించడం వంటివి జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక కోవిడ్ సమయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కరోనా సమయంలో నర్సులు జీవిత బీమా డిమాండ్ చేసినందుకు వెంటనే వారిని తొలగించేశారని ఆరోపణలు ఉన్నాయి. స్టైపెండ్‌లు చెల్లించకపోవడాన్ని నిరసించినందుకు మెడికల్ ఇంటర్న్‌లను కూడా సస్పెండ్ చేసేశారు.
యూనివర్సిటీ కేంద్రంగా అనేక దుర్మార్గాలు జరిగినట్లుగా అందులో పని చేసిన ఒక మాజీ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో ఈ భండారం వెలుగులోకి వచ్చింది. అయితే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అల్-ఫలాహ్ యూనివర్సిటీ దుర్మా్ర్గాలు అనేకమైనవి వెలుగులోకి వచ్చాయి. ఈ యూనివర్సిటీ కేంద్రంగా దేశ వ్యాప్తంగా వైద్యులు మారణహోమం సృష్టించాలని ప్రణాళికలు రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు కనిపెట్టాయి. దర్యాప్తు సంస్థలు ముందుగానే అప్రమత్తం అవ్వడంతో ఈ కుట్ర కోణం బయటపడింది. లేదంటే దేశంలో మరిన్ని దాడులు జరిగుండేవి. ఎంతో మంది ప్రాణాలు పోయేవి. ఇంత పెద్ద కుట్రను ఛేదించిన దర్యాప్తు సంస్థలకు కచ్చితంగా సెల్యూట్ కొట్టాల్సిందే.
తాజావార్తలు
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!