Delhi Car Blast: ఒక దుకాణంపై పడ్డ శరీర భాగాలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు
- ఒక దుకాణంపై పడ్డ శరీర భాగాలు
- స్వాధీనం చేసుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా పేలుడు జరిగిన 300 మీటర్ల దూరంలోని ఒక షాపుపై ఒక వ్యక్తి శరీర భాగాలు స్వాధీనం చేసుకున్నారు. లజ్‌పత్‌రాయ్ మార్కెట్‌లోని ఒక దుకాణంపై తెగిపోయిన చేయిను రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం శరీర భాగాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం అధికారుల పంపించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: వెలుగులోకి సంచలన ఫొటోలు.. దొరికిన ఉమర్ మూడో కారు.. ఎక్కడుందంటే..!
Also Read
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. గురువారం తెల్లవారుజామున ఎల్‌ఎన్ జేపీ ఆస్పత్రిలో గాయపడిన వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 13కు చేరింది. ఇంకా పలువురు ఆస్పత్రిలోనే కోలుకుంటున్నారు. ఇక బాధితులను బుధవారం ప్రధాని మోడీ పరామర్శించారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: రేపే బీహార్ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
ఇదిలా ఉంటే ప్రధానంగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ ఉగ్ర కుట్ర జరిగినట్లుగా గుర్తించారు. దేశ వ్యాప్తంగా నాలుగు నగరాల్లో భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా తేలింది. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డాక్టర్లు ఉమర్ నబీ, ముజమ్మిల్ డైరీల్లో ఈ ఉగ్ర ప్రణాళికను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్ర కుట్రకు యూనివర్సిటీలోని 17వ నెంబర్ భవనాన్ని ఉపయోగించుకున్నట్లుగా కనిపెట్టారు. ఈ భవనంలో ముజమ్మిల్‌కు 13వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచే ఉగ్ర కుట్రలకు పథక రచన చేసినట్లుగా తేలింది. గదిలో కొన్ని కెమికల్స్, డిజిటల్ పరికరాలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఉమర్‌కు 4వ నెంబర్ గది ఉంది. ఇక్కడ నుంచి కూడా మూడు డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీల్లో పలువురి పేర్లు ఉన్నాయి. అలాగే దాడులకు సంబంధించిన ప్రణాళికలు కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఒకేసారి దాడులు జరిపేందుకు మూడు కార్లు కొనుగోలు చేశారు. ఇందులో ఒక కారు ఎర్రకోట దగ్గర పేలిపోయింది. ఇంకో కారు ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కారు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇందులో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
మొత్తం 8 మందితో దేశ వ్యాప్తంగా దాడులు చేసేందుకు సిద్ధం చేసుకున్నట్లు డైరీల నుంచి సేకరించిన సమాచారంతో అధికారులు కనిపెట్టారు. ఎనిమిది మందిలో ఉమర్, ముజమ్మిల్, డాక్టర్ అదిల్, డాక్టర్ షాహీన్ కూడా ఉన్నట్లు గుర్తించారు. దాడుల బాధ్యతలను పూర్తిగా ఉమర్‌కు అప్పగించినట్లు సమాచారం. ఈ ప్రణాళిక అమలు కోసం మొత్తం రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బుతోనే అన్ని పరికరాలు సేకరించి.. పేలుడు పదార్థాలు సేకరించినట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!