ఒక వివాహ రిసెప్షన్‌లో దుండగుడు రెచ్చిపోయాడు. వేదికపై వధూవరులు బంధువులతో ఫొటోలు దిగుతుండగా హఠాత్తుగా ఒక యువకుడు కత్తితో ఎటాక్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో ముగిసిన షట్‌డౌన్.. బిల్లుపై ట్రంప్ సంతకం
మంగళవారం మహారాష్ట్రలోని అమరావతిలో రిసెప్షన్ వేడుక జరుగుతోంది. వధూవరులు ఫొటోలు దిగుతున్నారు. ఇంతలో రాఘో జితేంద్ర బక్షి అనే వ్యక్తి స్టేజ్‌పైకి ఎక్కి అమాంతంగా వరుడిని కత్తితో పొడవడం ప్రారంభించాడు. తొడపై పొడవడంతో అప్రమత్తమైన వరుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలో బంధువులు పట్టుకునే ప్రయత్నం చేయడంతో నిందితుడు పరారయ్యాడు. బయట రెడీగా ఉన్న బైక్‌పై జితేంద్ర పరారయ్యాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కూడా బెదిరించి పారిపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. డ్రోన్ కెమెరాలో రికార్డయ్యాయి. నిందితులు పారిపోతుండగా 2 కిలోమీటర్ల మేర డ్రోన్ వెంటాడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Al-Falah University: వామ్మో.. వైస్ ఛాన్సలర్‌ది కూడా చీకటి బాగోతమే.. హిస్టరీ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 22 ఏళ్ల సుజల్ రామ్ సముద్ర వివాహ వేడుక సందర్భంగా రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. నిందితుడు రాఘో జితేంద్ర బక్షి.. సుజల్ రామ్ స్నేహితుడిగా గుర్తించారు. గతంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుజల్ తొడ, మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు, అతిథులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సాధారణ చికిత్స తర్వాత యథావిధిగా వేదికపైకి వచ్చేశాడు. వ్యక్తిగత వైరం కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని డీసీపీ గణేష్ షిండే తెలిపారు.

ఇక దాడి తర్వాత నిందితుడి కుటుంబంపై బాధిత కుటుంబం దాడి చేసింది. ఇల్లును ధ్వంసం చేశారు. బైక్‌కు నిప్పంటించారు. దీంతో నిందితుడి కుటుంబం కూడా వరుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఎవరితోనూ శత్రుత్వం లేదని సుజాల్ పేర్కొన్నాడు. ఎందుకు దాడి చేశాడో అర్థం కావడం లేదన్నాడు.