ఎలోన్ మస్క్‌కు సంబంధించిన న్యూరాలింక్ పరికరం సత్‌ఫలితాలను ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. పక్షవాతానికి గురైన ఎనిమిది సంవత్సరాల తర్వాత 2024, జనవరిలో 30 ఏళ్ల నోలాండ్ అర్బాగ్‌కు యూఎస్ న్యూరోటెక్నాలజీ సంస్థ న్యూరాలింక్ పరికరాన్ని మొదడులో అమర్చారు. ఇప్పుడా వ్యక్తి వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా అర్బాగ్ స్పందిస్తూ.. మునుపటి కంటే తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఎలోన్ మస్క్‌కు ధన్యవాదాలు తెలిపాడు. తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రిస్తున్నట్లు పేర్కొన్నాడు. మొదడులో చిప్ పెట్టుకోకముందు తన పరిస్థితి ఘోరంగా ఉందని.. అన్ని విషయాల్లో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేదన్నాడు. కానీ ఇప్పుడు చిప్ కారణంగా తన మెదడు మెరుగుపడడంతో చదువుతో పాటు వీడియో గేమ్‌లు కూడా ఆడగల్గుతున్నట్లు అర్బాగ్ పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Ananya : బాలీవుడ్‌లో మరో బ్రేకప్.. బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టిన హీరోయిన్
సృష్టికర్త మస్క్..
న్యూరాలింక్ అనేది ఎలాన్ మస్క్ స్థాపించిన ఒక నూతన సాంకేతిక సంస్థ. ఇది మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ముఖ్యంగా పక్షవాతం వంటి పరిస్థితులతో బాధపడేవారికి సహాయపడటం కోసం ఈ పరికరం రూపొందించారు. ఈ పరికరం యొక్క లక్ష్యం… ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రించడం, బాహ్య పరికరాలను ఉపయోగించగలగడం వంటివి న్యూరాలింక్ లక్ష్యాలు. ఇక ఇది మొదడిలోని కార్యకలాపాలను రికార్డు చేస్తుంది.. ప్రసారం చేస్తుంది. ప్రస్తుతం చిప్ అమర్చుకున్న తొలి వ్యక్తి.. తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రించగలుగుతున్నాడు. కేవలం పక్షవాతం వంటి పరిస్థితులతో బాధపడేవారికి సహాయపడటం కోసమే ఈ పరికరం రూపొందించబడింది.
ఇది కూడా చదవండి: ASHA Workers Protest: హైదరాబాద్ లో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం