చెన్నైలో యూట్యూబర్ సవుక్కు శంకర్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మానవ మలాన్ని ఇంటి ముందు పారబోసి.. అతడి తల్లిని బెదిరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: భార్యను ముక్కలు చేసి ఉడకబెట్టిన కేసులో కీలక మలుపు..
సవుక్కు శంకర్ యూట్యూబర్. అతడు పారిశుద్ధ్య కార్మికుల గురించి ఏవో వ్యాఖ్యలు చేశారంటూ రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం శంకర్ ఇంటికి పారిశుద్ధ్య కార్మికుల దుస్తులు ధరించిన ఓ గుంపు వచ్చింది. వచ్చీరాగానే మురికి నీళ్లు.. మానవ మలాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పారబోశారు. అనంతరం ఇంట్లోకి చొరబడి శంకర్ తల్లిని బెదిరించారు. అనంతరం ఆమె ఫోన్ తీసుకుని.. శంకర్‌కు వీడియో కాల్ చేసి బెదిరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను శంకర్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. అధికారుల అప్రమత్తం
దాదాపు 20 మందితో కూడిన గుంపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంటి వెనుక తలుపులు బలవంతంగా పగలగొట్టి.. శంకర్ తల్లిని బెదిరించారు. అయితే ఆ సమయంలో శంకర్ ఇంట్లో లేడు. తల్లి కమల ఒక్కరే ఉన్నట్లుగా సమాచారం. అనంతరం ఆమె దగ్గర ఫోన్ తీసుకుని.. శంకర్‌కు వీడియో కాల్ చేశారు. అయితే ఏదైనా సమస్య ఉంటే.. తన కొడుకుతో తేల్చుకోవాలని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమల సూచించింది. సంఘటనాస్థలికి పోలీసులను పిలిపించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. వీడియోలను పరిశీలిస్తున్నారు. ఇక పారిశుద్ధ్య కార్మికులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని శంకర్ క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఈ ఘటనను బీజేపీ ఖండించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌పై ఆరోపణలు గుప్పించారు. ఇక ఈ దాడి ఆమోదయోగ్యం కాదని అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా అన్నారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని నమ్మే వారు దీనిని సహించలేరు. తన ప్రభుత్వం చట్టాన్ని పాటిస్తుందని చెప్పుకునే సీఎం స్టాలిన్ హయాంలో ఇది జరిగింది.’’ అని పేర్కొన్నారు.
என் வீட்டில் கழிவுகளை கொட்டும் சிசிடிவி காட்சி. pic.twitter.com/ZZQ6GpLBIR
— Savukku Shankar (@SavukkuOfficial) March 24, 2025
தாக்குதல் நடத்தியவர்கள் என் தாயாரின் போனை பிடுங்கி வீடியோ காலில் பேசியபோது பதிவு செய்தது.
இப்போது மணி 11.43. இந்தத் தருணம் வரை தாக்குதல் நடத்த வந்தவர்கள் அதே இடத்தில் இருக்கின்றனர். காவல்துறையினர் என்னை வீட்டுக்கு வரவேண்டாம் என்று அறிவுறுத்துகின்றனர். @CMOTamilnadu pic.twitter.com/yv5J1PiPm1
— Savukku Shankar (@SavukkuOfficial) March 24, 2025