మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. హాస్యనటుడు కునాల్ కమ్రా వ్యాఖ్యలను ఖండించారు. షిండేకు పూర్తి మద్దతు ప్రకటించారు. తన మిత్రుడిపై చేసిన వ్యాఖ్యలకు కునాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను హాస్యానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ ఒక వ్యక్తిని అగౌరవపరచడం సరికాదన్నారు. 2024 ఎన్నికల్లో దేశద్రోహి ఎవరో మహారాష్ట్ర ప్రజలు నిరూపించారన్నారు. బాల్ థాకరే వారసత్వం ఎవరికి ఉందో ప్రజలు నిర్ణయించారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చింది.. ఇతరుల స్వేచ్ఛను భంగపరచడానికి కాదన్నారు. రాజ్యాంగాన్ని ఎత్తు చూసి తప్పును సమర్థించుకోవడం భావ్యం కాదన్నారు.
ఇది కూడా చదవండి: Sabitha Indra Reddy: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు.. షీ టీమ్స్ ఏం చేస్తున్నాయి..!
అంతకముందు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా స్పందించారు. ఎవరూ చట్టం, రాజ్యాంగాన్ని దాటి మాట్లాడకూడదని తెలిపారు. అందరూ బాధ్యతాయుతంగా మాట్లాడాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు కారణంగా పోలీసులు జోక్యం చేసుకునే పరిస్థితి రాకూడదన్నారు.
నెల రోజుల క్రితం ఒక షోలో కమెడియన్ కునాల్ కమ్రా.. షిండేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 1997 బ్లాక్‌బస్టర్ దిల్ తో పాగల్ హై చిత్రంలోని ‘‘భోలి సి సూరత్’ పాటను పేరడీ చేసి కునాల్ కమ్రా పాడారు. ఏక్‌నాథ్ షిండేను లక్ష్యంగా చేసుకుని పేరడీ చేశారు. 2022లో ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు నాయకత్వం వహించి, ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసి, పార్టీని విభజించిన శివసేన నాయకుడు దేశద్రోహి అంటూ కునాల్ వ్యాఖ్యానించాడు.
ఇది కూడా చదవండి: Jana Nayagan : విజయ్ చివరి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
తాజాగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో శివసేన కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. దీంతో ఆదివారం ముంబైలోని హాబిటాట్ స్టూడియోపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. అంతేకాకుండా ఒక క్లాబ్‌పై కూడా దాడి చేశారు. కుర్చీలు, కెమెరాలు, లైట్లు, స్పీకర్లను ధ్వంసం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ది హాబిటాట్ స్టూడియోను మూసివేయాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. స్టాండ్-అప్ కామెడీ షోలకు ఈ స్టూడియో పేరు సంపాదించింది. ప్రస్తుతానికి మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ది హాబిటాట్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: YS Jagan: రైతులను పట్టించుకోరా..? ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి..