దక్షిణాది రాష్ట్రాలను బీజేపీ ఎప్పుడూ అణిచివేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలో డీలిమిటేషన్‌పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు
అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన ప్రతాపం చూపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు. తాజాగా 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను అమెరికా రద్దు చేసింది. త్వరలో వారంతా బహిష్కరణకు గురికానున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు అక్రమ వలసదారులపై ట్రంప్ వేటు వేస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ అక్రమాలకు సంబంధించిన మరిన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 14న ఢిల్లీలో ఆయన నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. లెక్కల్లో చూపించని నగదుగా అధికారులు గుర్తించారు. ఈ విషయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్లడంతో ఆయన్ను ప్రస్తుతం అలహాబాద్ కోర్టుకు బదిలీ చేశారు.
ఇరుగుపొరుగు అన్నాక.. సహజంగానే గొడవలు ఉంటాయి. మాటలు లేనప్పుడు చాలా మంది శుభకార్యాలకు పిలవరు. ఇక పిలవడం.. పిలవకపోవడం అనేది నిర్వాహకుల ఇష్టం. కానీ ఒక వ్యక్తి మాత్రం పగ పెట్టుకున్నాడు. పెళ్లికి ఇందుకు పిలవలేదంటూ వరుడి తండ్రిపైనే పొరుగింటి వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఎలాంటి అనుమానాలు వచ్చినా.. దేశం నుంచి బహిష్కరణ వేటు వేస్తున్నారు. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సురిని అమెరికా బహిష్కరణ వేటు వేసింది.
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు సమర శంఖారావాన్ని పూరించాయి. ఇప్పటికే ఢిల్లీ వేదికగా తమిళనాడు డీఎంకే ఎంపీలు పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. తాజా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది.
ఐర్లాండ్ అధ్యక్ష పదవి కోసం యూఎఫ్‌సీ ఫైటర్ కోనర్ మెక్‌గ్రెగర్ (36) బరిలోకి దిగారు. ఈ మేరకు గురువారం ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల కోసం తన పేరును నమోదు చేసుకున్నారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మెక్‌గ్రెగర్ కలిశారు. అనంతరం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో సంస్థాగత మార్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్ అధినేత కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురి సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.
టెస్లా ఆస్తులపై దాడులు చేస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా టెస్లా ఆస్తులపై దాడుల చేస్తే 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల టెస్లా కార్ల షోరూమ్‌కి నిప్పుపెట్టారు. పలు కార్లు దగ్ధమయ్యాయి. ఇది ఉగ్ర చర్యగా టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆరోపించారు.
కర్ణాటక అసెంబ్లీ రణరంగంగా మారింది. ముస్లిం కోటా బిల్లుపై అధికార-ప్రతిపక్ష సభ్యలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మొత్తానికి ఆందోళనల మధ్యే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది.