పహల్గామ్ ఉగ్ర దాడిపై అంతర్జాతీయ మీడియా పక్షపాతం ప్రదర్శిస్తోంది. పాకిస్థాన్‌కు అనుకూలంగా.. భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉగ్ర దాడిని మిలిటెంట్ దాడిగా ప్రపంచానికి పరిచయం చేసింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్‌పై నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్స్‌పై వేటు పడింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీ దగ్గర నిరంతరం కాల్పులకు తెగబడుతోంది
పహల్గామ్ ఉగ్ర దాడి కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపితే.. వారి చేసిన పనికి ఇంకొందరి జీవితాలకు కష్టాలు తెచ్చి పెట్టింది. పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. అందులో ముఖ్యంగా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. దీంతో భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దగ్గరకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా నాలుగో రోజు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.
తాను పాకిస్థాన్ వెళ్లనని.. తాను ప్రస్తుతం భారతీయ కోడలినని.. తనను ఇక్కడే ఉండనివ్వాలని అని సీమా హైదర్ విజ్ఞప్తి చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఏప్రిల్ 29లోపు అందరూ వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఖైబర్-పఖ్తుంఖ్వాలోని కాకుల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగించారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఆదిల్ అహ్మద్ థోకర్‌కు సంబంధించిన కీలక విషయాలను నిఘా సంస్థలు రాబట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్దే కీలక రోల్‌గా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.