ప్రధాని మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న పాక్ సైన్యం కాల్పులపై సీడీఎస్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్.. రాజ్‌నాథ్‌సింగ్‌తో చర్చించారు. ఒక్కరోజు భేటీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్.. ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: బీబీసీ తప్పుడు కథనాలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ కేంద్రం లేఖ
భద్రతా సిబ్బంది సంసిద్ధత గురించి ప్రధానికి రాజ్‌నాథ్‌సింగ్ వివరించనున్నారు. పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి సైన్యం తీసుకున్న కీలక నిర్ణయాలను మోడీకి వివరించనున్నారు. గత నాలుగు రోజులుగా పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటూ తిప్పికొడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: పాక్-భారత్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. అలాగే అటారీ సరిహద్దు మూసివేసింది. తాజాగా పాక్‌కు సంబంధించిన 16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం విధించింది. ఇలా ఒక్కొక్కటిగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక ఉగ్ర దాడులకు పాల్పడ్డ నిందితుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. గత మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు ఉండడం బాధాకరం.
ఇది కూడా చదవండి: Pak-India: బోర్డర్‌లో ఉద్వేగ పరిస్థితి.. తల్లికి దూరమైన పసిబిడ్డలు.. కారణమిదే!