కన్నడ నటి, బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు మరింత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై నమోదైన కేసుల నేపథ్యంలో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితులు లేవు. దీంతో సంవత్సరం పాటు కారాగారంలోనే బందీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల అడవి ప్రాంతంలో గత ఐదు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. 48 గంటల్లో ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే మానవతా దృక్పథంతో వైద్య, దౌత్య మరియు దీర్ఘకాలిక వర్గాలకు కొంత మినహాయించింది. తాజాగా వారికి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. పహల్గామ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వరుసగా రెండో రోజు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ సైన్యం ఎల్ఓసీ వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం అప్రమత్తమై.. కాల్పులను తిప్పికొట్టింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది.
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియాకు చెందిన గియుఫ్రే(41) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసింది. తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా భారత్ గుర్తించింది. లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను దాయాది దేశం పెంచిపోషిస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది.