సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
పహల్గామ్ ఉగ్ర దాడిపై పాకిస్థా్న్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగడం విషాదకరమని తెలిపారు.
ప్రధాని మోడీ మంగళవారం త్రివిధ దళాలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఏం చేయాలన్నదానిపై మేథోమథనం చేశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ప్రధాని మోడీ మార్గదర్శకం చేశారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఓసీ) పాకిస్థాన్ వరుస కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
పహల్గామ్ దాడి తరహాలో మరిన్ని దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత తర్వాత జమ్మూకాశ్మీర్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి.
పహల్గామ్ ఉగ్ర దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. అంతేకాకుండా స్థానిక వీడియోగ్రాఫర్స్ నుంచి వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్కు విశిష్ట అతిథి వచ్చింది. ఏ వీఐపీనో... సెలబ్రిటీనో కాదు. ఎన్నడూ పోలీస్ వాళ్లు కూడా చూడని అతిథి రావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.