Zelenskyy: యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా లేదు.. ట్రంప్ ప్రకటన తర్వాత జెలెన్‌స్కీ వ్యాఖ్య
- యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా లేదు
- ట్రంప్ ప్రకటన తర్వాత జెలెన్‌స్కీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యాతో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ట్రంప్ మాట్లాడారు. సంభాషణ తర్వాత జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
యుద్ధంలో చాలా కోల్పోయినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. యుద్ధం ముగించడం చాలా ముఖ్యమైన అంశమని.. అందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా రష్యాకు ఉన్న నియమాలు ఏంటి? అనేది తెలియాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ రష్యా యుద్ధం ఆపకపోతే ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Government Land Encroached: మాజీ మంత్రి కబ్జా చేసిన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై త్వరలోనే రష్యా-ఉక్రెయిన్ చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు వీరిద్దరి మధ్య 2 గంటల పాటు సంభాషణ జరిగింది. ఈ ఫోన్ కాల్ సంభాషణతో తర్వాత ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. పుతిన్‌తో తన సంభాషణ చాలా బాగా సాగిందని తెలిపారు. ఈ చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొ్న్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిస్తామని పుతిన్ చెప్పినట్లుగా ట్రంప్ వెల్లడించారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో రష్యా-ఉక్రెయిన్ మాత్రమే చర్చించుకుంటాయని.. ఇతరుల జోక్యం ఉండదన్నారు. ఎందుకంటే ఎవరికీ తెలియని వివరాలు వారికి మాత్రమే తెలుస్తాయని.. ఈ విధానమే ఏకైక మార్గం అని పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో రెండు గంటల పాటు మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డేర్ లేయన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌లతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని వారికి తెలియజేసినట్లు చెప్పారు. ఇక ఫోన్ కాల్ సంభాషణ తర్వాత పుతిన్‌ను ట్రంప్ ప్రశంసించారు. అద్భుతం అంటూ కొనియాడారు.
పుతిన్ కృతజ్ఞతలు..
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభానికి మద్దతు ఇచ్చినందుకు ట్రంప్‌నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. శాంతి స్థాపన పురోగతికి పలు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ రష్యా నిబద్ధతను ట్రంప్ అంగీకరించినట్లు పుతిన్ తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సరైన దిశలోనే సాగుతున్నట్లు పుతిన్ తెలిపారు. అయితే శాంతి స్థాపన అనేది సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇరుదేశాల్లో శాంతి కోసం ఉత్తమమైన మార్గాలను వెతకడం ప్రస్తుతం ముఖ్యమని పుతిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పుతిన్ నిజాయతీని యురోపియన్ నేతలు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!