బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.
దేశ వ్యాప్తంగా మావోల ఏరివేతకు కేంద్రం పూనుకుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో తిష్ట వేసిన మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇక ఇటీవల కాలంలో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
దేశంలో మరోసారి రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 19న అస్సాం, తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో రెండు, తమిళనాడులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత రక్షణ రంగం అప్రమత్తం అవుతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక ఆయుధాలు తయారు చేసేందుకు రక్షణ రంగం సిద్ధపడుతోంది.
పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే దాయాది దేశం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పినట్లు ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. గాంధీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.
కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే.. మరో బీజేపీ నేత.. ఒక ముస్లిం మహిళా ఐఏఎస్ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
హర్యానాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు కారులో లభ్యమయ్యాయి. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.