కేరళలో జరిగిన ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో చిక్కుకున్న ఓ పెద్ద టయోటా ఫార్చ్యూనర్ కారును భారీ ఏనుగు సెకన్లలో బయటకు లాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Rohit Sharma : భారీ రికార్డుపై కన్నేసిన హిట్ మ్యాన్
తెల్లటి టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కారు కేరళలోని ఒక నదిలో చిక్కుకుంది. టయోటా ఫార్చ్యూనర్ బరువు 2,105 కిలోల నుంచి 2,135 కిలోల మధ్య ఉంటుంది. నదిలో కారు ముందు చక్రమే వీడియోలో కనిపిస్తోంది. అయితే ఓ భారీ ఏనుగును తీసుకొచ్చారు. కారు ముందు భాగానికి తాడు కట్టారు. ఆ తాడును గజేంద్రుడు నోటిలో పెట్టుకుని.. తొండంతో సెకన్ల వ్యవధిలోనే బయటకు లాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Mangaluru Murder: సంచలనంగా మంగళూర్ హత్య.. కాంగ్రెస్‌కి ముస్లిం కార్యకర్తల సామూహిక రాజీనామా..
ఏనుగు వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏనుగు బలం ఎంతుంటుందో ఈ వీడియోతో రుజువైందని ఒకరు. ఇకపై టో ట్రక్కులకు బదులుగా ఏనుగులు ఉపయోగిస్తామని మరొకరు. జస్ట్ ఒక బొమ్మను లాగినట్లుగా లాగేసిందంటూ ఇంకొకరు కామెంట్లు చేశారు. మరికొందరు ఏనుగు బలంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏనుగు శక్తి, చురుకుదనం బాగుందని కొనియాడుతున్నారు.
ఏనుగులను శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో గౌరవిస్తారు. వాటి జ్ఞానం, బలం, విధేయత కోసం పూజిస్తారు. భారతీయ రాజవంశాల్లో ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తాయి. అంతేకాకుండా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తుంటారు.