క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘోర విషాద ఘటన కర్ణాటకలోని కొడగులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
19 ఏళ్ల తేజస్విని కళాశాల హాస్టల్‌లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈశాన్య కర్ణాటకలోని రాయచూర్ నివాసి మహంతప్ప ఏకైక కుమార్తె తేజస్విని. కొడగు జిల్లా పొన్నంపేటలోని హల్లిగట్టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరింది.
ఇది కూడా చదవండి: CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..
మూడు రోజుల క్రితం 19వ పుట్టినరోజును స్నేహితులతో కలిసి జరుపుకుంది. బర్త్‌డేకు హాజరుకాని వారికి బుధవారం మరోసారి స్వీట్లు కూడా పంచిపెట్టింది. తరగతులకు హాజరైన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి తన హాస్టల్ గదికి తిరిగి వచ్చింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆమె క్లాస్‌మేట్స్‌లో ఒకరు.. గది తలుపు లోపలి నుంచి లాక్ చేయబడి ఉండటాన్ని గమనించింది. పదే పదే తట్టినా, ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఈ విషయాన్ని హాస్టల్ సూపర్‌వైజర్ దృష్టికి తీసుకెళ్లింది. బలవంతంగా తలుపు తెరిచి చూస్తే తేజస్విని విగతజీవిగా పడి ఉంది. సమీపంలోనే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్ట్ వర్కులు, తదుపరి చదవులు చదవడం ఇష్టం లేనట్లుగా నోట్‌లో పేర్కొంది.
పొన్నంపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే చనిపోయినట్లు సూసైడ్‌లో పేర్కొందని తెలిపారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీటిపర్యంతం అయ్యారు.