Trump-Musk: ట్రంప్-మస్క్ మధ్య పెరుగుతున్న దూరం.. ట్యాక్స్ బిల్లుపై పోరాటం చేయాలని పిలుపు
- ట్రంప్-మస్క్ మధ్య పెరుగుతున్న దూరం
- ట్యాక్స్ బిల్లుపై పోరాటం చేయాలని అమెరికన్లకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ట్రంప్ పరిపాలన నిర్ణయాలను మస్క్ ఎండగడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది చాలా అసహ్యమైనది అని.. దీంతో అమెరికా దివాళా తీయడం ఖాయమని మస్క్ హెచ్చరించారు. అంతేకాకుండా పన్ను బిల్లుకు ఆమోదముద్ర వేసి అమెరికన్ ప్రజలకు ద్రోహం చేసిన రాజకీయ నాయకులందరినీ వచ్చే ఏడాది నవంబరు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు మట్టికరిపించనున్నారని మస్క్ వార్నింగ్ ఇచ్చారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం బిల్లును సమర్థించింది. ఈ చట్టం ‘‘అపూర్వమైన ఆర్థిక వృద్ధి యుగాన్ని ఆవిష్కరిస్తుంది’’ అని పేర్కొంది.
ఇది కూడా చదవండి: World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ఎప్పుడు మొదలైందో తెలుసా?
Also Read
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
తాజాగా మస్క్ మరొక ట్వీట్ చేశారు. ట్రంప్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుపై అమెరికన్లు చర్య తీసుకోవాలని కోరారు. ‘‘మీ సెనేటర్‌కి కాల్ చేయండి.. లేదంటే మీ కాంగ్రెస్ సభ్యుడికి కాల్ చేయండి.’’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ‘‘ అమెరికా దివాలా తీయడం సరికాదు’’ అని మస్క్ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Sanjana Varada: ఢిల్లీలో మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలు.. ఏపీ నుంచి ఫైనలిస్టు ఎంపిక..
ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ట్యాక్ బిల్లు.. విద్యుత్ వాహనాలకు, హరిత ఇంధనాలకూ నిధులను తగ్గించేస్తుంది. ఇది అమెరికాలో అతిపెద్ద విద్యుత్ వాహన ఉత్పత్తిదారైన టెస్లా కంపెనీకీ, దాని యజమాని మస్క్‌కు తీరని నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే 36 లక్షల కోట్ల డాలర్లకు చేరిన అమెరికా ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించడానికి ఈ బిల్లు పేదల ఆరోగ్య బీమా మెడికెయిడ్‌కూ, ఆహార టోకెన్లకూ కోత పెడుతోంది. అయితే బిల్లుపై మస్క్ పోరాడినట్లు తెలుస్తోంది. ట్రంప్ సర్కార్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినా.. చివరికి విఫలం కావడంతో మస్క్ ఈ విధమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Call your Senator,
Call your Congressman,Bankrupting America is NOT ok!
KILL the BILL
— Elon Musk (@elonmusk) June 4, 2025
తాజావార్తలు
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
-
Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్‌ప్లే, 100W ఛార్జింగ్తో అదుర్స్!
-
India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ఖరారు..
-
Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..