అమెరికాలో మరొక యూనివర్సిటీకి ట్రంప్ సర్కా్ర్‌తో ముప్పు వచ్చి పడింది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. యూదులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం పని చేస్తుందంటూ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా సర్టిఫికేషన్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. తాజాగా కొలంబియా యూనివర్సిటీ వంతు వచ్చింది. యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ బెదిరించింది. విశ్వవిద్యాలయంలో యూదులకు తగినంత రక్షణ కల్పించలేకపోయిందని ట్రంప్ పరిపాలన ఆరోపించింది. కొలంబియా విశ్వవిద్యాలయం ప్రమాణాలను అందుకోలేకపోయిందని.. గుర్తింపును రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Yuzvendra Chahal: చహల్ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడు!
2023, అక్టోబర్ 7 హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అనంతరం హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. అలా గాజాను పూర్తిగా ధ్వంసం చేసింది. అనంతరం అమెరికాలో యూదులకు వ్యతిరేకంగా.. పాలస్తీనాకు మద్దతుగా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలో యూనివర్సిటీలు యూదులకు వ్యతిరేకంగా పని చేశాయని.. పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయని ట్రంప్ పరిపాలన అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే హార్వర్డ్ యూనివర్సిటీపై ఆంక్షలు విధించారు.
ఇది కూడా చదవండి: Dulquer Salmaan : OTT లోకి దుల్కర్ సల్మాన్ ‘ఒక యముడి ప్రేమకథ’..
తాజాగా కొలంబియా విశ్వవిద్యాలయానికి షాకిచ్చేందుకు రెడీ అయింది. యూదులపై వేధింపులను పరిష్కరించడంలో కొలంబియా యూనివర్సిటీ విఫలమైందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు యూనివర్సిటీకి అమెరికా విద్యా కార్యదర్శి లిండా మెక్‌మహాన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. కొలంబియా యాజమాన్యం అనైతికంగా ప్రవర్తించిందని.. అంతేకాకుండా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు లేఖలో పేర్కొన్నారు. అందుకోసమే యూనివర్సిటీ అక్రిడిటేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ అక్రిడిటేషన్ ఉంటేనే ఏ విశ్వవిద్యాలయానికైనా బిలియన్ల డాలర్ల నిధులు పొందేందుకు అనుమతి ఉంటుంది.
ఇటీవల ట్రంప్ కూడా యూనివర్సిటీలు వ్యవహరించిన తీరును ఖండించారు. ఇజ్రాయెల్-గాజా యుద్ధం సమయంలో అమెరికన్ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో విద్యార్థులు చేపట్టిన నిరసనల మధ్య యూదు విద్యార్థులను రక్షించడంలో కొలంబియా మరియు ఇతర అమెరికన్ విశ్వవిద్యాలయాలు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపించారు. కొలంబియా యూనివర్సిటీ యూదు వ్యతిరేకం అని పేర్కొన్నారు. దీంతో ఫిబ్రవరిలోనే 400 మిలియన్ డాలర్ల సమాఖ్య నిధులను నిలిపేశారు.
యూనివర్సిటీ వివరణ
మా క్యాంపస్‌లో యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడానికి కొలంబియా తీవ్రంగా కట్టుబడి ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘మేము ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తాము మరియు దీనిని పరిష్కరించడానికి సమాఖ్య ప్రభుత్వంతో కలిసి పని చేస్తూనే ఉన్నాము.’’ అని విశ్వవిద్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అయితే కొలంబియా యూనివర్సిటీ ఇచ్చిన వివరణపై ట్రంప్ సర్కార్ సంతృప్తి చెందలేదు. దీంతో చర్యలు తీసుకునేందుకే సిద్ధపడుతోంది.