ఇండోర్‌కు సంబంధించిన కొత్త జంట రాజా రఘువంశీ-సోనమ్ మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. మే 23న జంట అదృశ్యమైంది. అయితే రాజా తల్లి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉండేది. మే 23న కూడా రాజా తల్లి ఫోన్ చేసింది. కానీ కొడుకు మొబైల్ పని చేయలేదు. దీంతో కోడలు సోనమ్‌కు ఫోన్ చేసింది. రాజా ఫోన్ ఎందుకు పని చేయట్లేదని అడిగింది. అయితే కోడలి సమాధానం కొంచెం ఘాటుగా ఉన్నట్లు ఆడియోలో కనిపించింది. రాజా చెప్పినా వినకుండా ట్రెక్కింగ్‌కు వెళ్లాడని.. ఇక్కడ ఊపిరి ఆడడం లేదని.. తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల పాటు సంభాషణ జరిగింది. అయితే అత్త గారు ఒక కూతురితో మాట్లాడినట్టుగానే మాట్లాడింది. చాలా ప్రేమతో సంభాషించింది. కోడలిని ఒక కూతురిగానే భావించినట్లు కనిపించింది. అత్త గారు ఫోన్ చేసేటప్పటికే రాజాను చంపేసి ఉంటారేమో.. కోడలి కంగారు మాటలు వింటుంటే అలానే అనిపిస్తోంది. ఫోన్.. రాజాకు ఇమ్మని అంటుందేమోనని ట్రెక్కింగ్‌కు వెళ్లాడని అబద్ధం ఆడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: భర్తతో సన్నిహితంగా ఉండలేకపోతున్నా.. ప్రియుడికి మెసేజ్ పెట్టిన సోనమ్
ఇక ఫోన్ కాల్ సమయంలో ఈ రోజు ఉపవాసం గుర్తుందా? అని సోనమ్‌ను అత్తగారు అడిగింది. అవును.. ప్రయాణం వల్ల ఉపవాసాన్ని విరమించుకున్నట్లు సోనమ్ సమాధానం ఇచ్చింది. ఒకవేళ ఉపవాసం ఉన్న కొంచెం ఆహారం తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ట్రెక్కింగ్ చేస్తున్నామని.. అడవిలో ఏం దొరకదని సోనమ్ సమాధానం ఇచ్చింది. అయినా అక్కడికి ఎందుకు వెళ్లారు అని రాజా తల్లి అడిగింది. వెళ్లొద్దని చెప్పినా రాజా వినలేదని.. సరైన ఆహారం కూడా దొరకడం లేదని సోనమ్ సమాధానం ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: రాజా అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు.. వీడియో వైరల్
మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కు వివాహం అయింది. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వచ్చారు. మే 23న హఠాత్తుగా జంట అదృశ్యమైంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు మేఘాలయ పోలీసులు దర్యాప్తు చేపట్టగా జూన్ 2న రాజా మృతదేహం లభించింది. కానీ సోనమ్ ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కోసం కూడా గాలిస్తున్నారు. ఇంతలో ఆమె జూన్ 9న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది.
ప్రియుడు రాజ్ కష్వాహాతో కలిసి సోనమ్.. తన భర్త రాజాను చంపినట్లుగా పోలీసులు వెల్లడించారు. మృతదేహం కనిపించకుండా ఉండేందుకే మేఘాలయ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మేఘాలయలో రాజా మృతదేహం పైకి తీసినప్పుడు అక్కడే సోనమ్ ప్రియుడు కూడా ఉన్నాడు. సోనమ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చాడు. అంతేకాకుండా మృతదేహం తరలించే వాహనాల్లో ఒక వాహనాన్ని ఇండోర్‌కు తరలించాడు. అంతేకాకుండా రాజా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సోమవారం రాజా పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులో రాజా శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లుగా తేలింది. అలాగే తల ముందు.. వెనుక భాగంలో కూడా బలమైన గాయాలు ఉండడంతో చనిపోయినట్లుగా తేలింది.