వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. పొదిలిలో పర్యటన కొనసాగనుంది. పొగాకు రైతులను పరామర్శించనున్నారు. అనంతరం పొదిలి పొగాకు బోర్డును సందర్శించి అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. జగన్ పర్యటన కోసం పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. వీడియో వైరల్..
జగన్ పర్యటన షెడ్యూల్..
1. బుధవారం ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11 గంటలకు పొదిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా పొగాకు బోర్డుకు చేరుకుంటారు.
2. ఉదమం. 11.25 నుంచి మధ్యాహ్నం 12.25 వరకు పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖిగా మాట్లాడతారు.
3. మధ్యాహ్నం 12.25 గంటలకు పొగాకు బోర్డు నుంచి తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
4. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్‌లో తాడేపల్లి బయలుదేరి వెళ్తారు.
ఇది కూడా చదవండి: Off The Record: విచ్చలవిడి వలసలకు టీడీపీ చెక్ పెట్టబోతోందా..?