అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం కూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం కూలిపోయినట్లుగా తెలుస్తోంది. సంఘటనాస్థలికి 12 ఫైరింజన్లు చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ఇక విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఎయిర్‌పోర్టులో భారీగా పొగలు కమ్ముకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అతిషి నియోజకవర్గమైన కల్కాజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గోవింద్‌పురి జుగ్గి క్లస్టర్లో ఉన్న 1,200కు పైగా అక్రమ గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు.
పంజాబ్‌కు చెందిన ప్రముఖు ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదేష్ మెడికల్ యూనివర్సిటీలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలో ఏం జరగబోతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది.
రాజా రఘువంశీ-సోనమ్ చూడముచ్చటైన జంట. ఏ ఫొటోలు చూసినా.. ఏ వీడియో చూసినా చాలా చక్కగా.. చిలకగోరింకల్లా ఉన్నారు. ఇక ఇరు కుటుంబాలు కూడా ఆర్థికంగా బలమైన కుటుంబాలే.
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితులకు జితేంద్ర రఘువంశీ యూపీఐ ఖాతా నుంచి నగదు బదిలీ అయింది. సోనమ్ రఘువంశీ.. జితేంద్ర రఘువంశీ ఖాతా నుంచి నగదు బదిలీ చేసినట్లుగా మేఘాలయ పోలీసులు గుర్తించారు.
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించి చాలా రోజులైంది. అలాగే జూన్ మాసం కూడా సగం రోజులైపోతుంది. కానీ ఉష్ణోగ్రతల్లో మాత్రం మార్పు రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుంటే.. ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవలే 11 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 11 ఏళ్ల పాలనలో మహిళలకు పెద్ద పీట వేశామని.. వారిని ఎంతగానో గౌరవించినట్లు బీజేపీ శ్రేణులు ప్రకటించారు. తాజాగా నారీమణులకు కేంద్రం మరో శుభవార్త చెప్పుబోతుంది.
ప్రధాని మోడీ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని అడిగితే మోడీ అంగీకరించలేదని తెలిపారు.
ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిక్ హత్యకేసులో కుట్రదారుడు జీషాన్ అక్తర్ కెనడాలో అరెస్ట్ అయ్యాడు. అక్తర్‌ను తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.