ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ భర్తను చంపేసినట్లుగా పోలీసులు తేల్చారు. తాజాగా రాజా రఘువంశీ అంత్యక్రియల్లో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Today Gold Prices: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మరోమారు భారీగా తగ్గిన ధరలు..!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనమ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. మే 23న జంట అదృశ్యమైంది. దీంతో భయాందోళన చెందిన బాధిత కుటుంబ సభ్యులు మేఘాలయ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు లోయలో జల్లెడ పట్టగా జూన్ 2న రాజా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల సభ్యులంతా మేఘాలయలోనే ఉన్నారు. శరీరంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా రాజా మృతదేహంగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అయ్యారు. ఆ సమయంలో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా అక్కడే ఉన్నాడు. ఏ పాపం తెలియదు అన్నట్టుగా సోనమ్ తండ్రిని ఓదార్చాడు. అంతేకాకుండా మృతదేహం వాహనంలో తరలించే ఏర్పాటులో కూడా పాల్గొన్నాడు. అలాగే నాలుగు వాహనాల్లో ఒక వాహనాన్ని రాజ్ కుష్వాహానే నడిపాడు.
ఇది కూడా చదవండి: Bengaluru Stampede: ఆర్సీబీ ఆటగాళ్ల సన్మానానికి ప్లాన్ సర్కారుదే.. కర్ణాటక గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
ఇక ఇండోర్‌లో రాజా అంత్యక్రియలు జరుగుతుండగా రాజ్ కుష్వాహా కూడా పాల్గొన్నాడు. సోనమ్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చినట్లుగా నటించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రాజా రఘువంశీ సోదరి సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో రాజా కుటుంబం ఆశ్చర్యపోతుంది. హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే రాజా రఘువంశీ కుటుంబానికి సోనమ్ ప్రియుడు విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోనమ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో మే 11న వివాహం జరిగింది. అయితే పెళ్లైన 4 రోజులకే సోనమ్ తిరిగి తన పుట్టింటికి వచ్చేసింది. ఆ సమయంలోనే తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసింది. ఇద్దరు కలిసి రాజా రఘువంశీ మర్డర్‌కు ప్లాన్ వేశారు.
రాజ్ కుష్వాహా.. సోనమ్ తండ్రికి సంబంధించిన కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ సాగుతోంది. అయితే మధ్యలో ఏమైందో ఏమో తెలియదుగానీ ఏడాది నుంచి రాజ్ కుష్వాహా పని చేయడం మానేశాడు. ప్రస్తుతం వేరే చోట పని చేస్తున్నాడు. అయినా కూడా ఏడాది నుంచి రాజ్ కుష్వాహాతో సోనమ్ రహస్యంగా ఎఫైర్ కొనసాగిస్తోంది.
మర్డర్ ప్లాన్ వేసుకున్న సోనమ్… తిరిగి ఇండోర్‌కు వచ్చింది. వాస్తవానికి హనీమూన్‌కు గౌహతి వెళ్లాలని రాజా రఘువంశీ ప్లాన్ చేశాడు. అందుకు సోనమ్ నిరాకరించింది. మేఘాలయ వెళ్లాలని పట్టుపట్టింది. దీంతో భార్య మాట కాదనలేక రాజా రఘువంశీ మేఘాలయకు టికెట్లు బుక్ చేశాడు. అలా మే 20న మేఘాలయకు వచ్చారు. వారితో పాటే ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ముగ్గురు కిరాయి హంతకులు వచ్చారు. ఇక కొత్త జంట స్థానికంగా ఒక స్కూటీ తీసుకుని తిరుగుతున్నారు. సోనమ్ మొబైల్ నుంచి ఎప్పటికప్పుడు ప్రియుడికి లోకేషన్లు పంపిస్తూ ఉండేది. ఇక మే 23న లోయలోకి రాజా ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన లొకేషన్ కూడా ప్రియుడికి పంపించింది. రాజా ట్రెక్కింగ్‌కు వెళ్లాక కిరాయి హంతకులు రాజాను పట్టుకుని చంపేశారు. అనంతరం మృతదేహాన్ని లోయలో పడేశారు. అలా మే 23 నుంచి జంట అదృశ్యమైంది.
అయితే బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు మేఘాలయ పోలీసులు కేసు నమోదు చేసి గాలించారు. అంతేకాకుండా స్థానికుల నుంచి కూడా వివరాలు సేకరించారు. అయితే చివరి సారిగా జంటను ఓ టూరిస్ట్ గైడ్ చూశాడు. వారితో పాటు ముగ్గురు హిందీ మాట్లాడే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులకు కీలక సమాచారం లభించడంతో డ్రోన్ల ద్వారా గాలింపు చేపట్టగా.. జూన్ 2న లోయలో రాజా మృతదేహం లభించింది. హత్యగా ధృవీకరించారు. అనంతరం భార్య సోనమ్ కోసం గాలించారు. ఎట్టకేలకు జూన్ 9న సోనమ్ సజీవంగా ప్రత్యక్షమైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది.
తనకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేశారని.. అనంతరం ఘాజీపూర్‌లో వదిలేశారని చెప్పుకొచ్చింది. దీంతో సీసీకెమెరాలను పరిశీలించగా సోనమ్ ఒంటరిగానే వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో సోనమ్ కేసు నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లినట్లుగా పోలీసులు తేల్చారు. ఇక మేఘాలయ పోలీసులు కూడా ముందస్తు ప్రణాళికతోనే రాజాను సోనమ్ చంపించినట్లుగా తేల్చారు. మృతదేహం కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతోనే లోయలో పడిసినట్లుగా గుర్తించారు. ఇక నిందితులు కూడా నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం మేఘాలయ పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.